AliaBhatt: ‘మా పెళ్లి ఎప్పుడో అయిపోయింది’ : అలియాభట్‌

బాలీవుడ్‌ నటీనటులు అలియాభట్‌, రణ్‌బీర్‌ కపూర్‌ కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. చిన్ననాటి నుంచి స్నేహితులైన వీరిద్దరూ ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్‌ సమయంలో ప్రేమలోపడ్డారు....

Updated : 11 Feb 2022 14:17 IST

ముంబయి: బాలీవుడ్‌ నటులు అలియాభట్‌, రణ్‌బీర్‌ కపూర్‌ కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. చిన్ననాటి నుంచి స్నేహితులైన వీరిద్దరూ ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్‌ సమయంలో ప్రేమలోపడ్డారు. ఈక్రమంలోనే వీరి పెళ్లిపై రెండేళ్ల నుంచి వరుస కథనాలు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అలియాభట్‌.. రణ్‌బీర్‌తో పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం ‘గంగూబాయ్‌ కతియావాడీ’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న అలియా.. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఇష్టాయిష్టాలపై స్పందించారు. ‘‘షూటింగ్స్‌ నుంచి ఏ మాత్రం ఖాళీ దొరికినా ఏదో ఒక కొత్త పని నేర్చుకోవడానికి ఆసక్తి కనబరుస్తుంటాను. సమయాన్ని వృథా చేయడం నాకు అస్సలు నచ్చదు. కరోనా కారణంగా షూటింగ్స్‌ వాయిదా పడిన సమయంలో మ్యూజిక్‌పై దృష్టిపెట్టాలనుకున్నా. అప్పుడు గిటార్‌ నేర్చుకున్నా. స్క్రీన్‌ రైటింగ్‌లో శిక్షణ తీసుకున్నా’’ అని ఆలియా చెప్పుకొచ్చారు.

అనంతరం విలేకరి.. ‘‘గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రణ్‌బీర్‌ తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ లేకపోతే ఈపాటికి అయిపోయి ఉండేదని అన్నారు. నిజమేనా?’’ అని ప్రశ్నించగా.. ‘‘నా దృష్టిలో మా పెళ్లి ఎప్పుడో అయిపోయింది. రణ్‌బీర్‌ చెప్పింది నిజమే. లాక్‌డౌన్‌ కారణంగా అప్పుడు పెళ్లి వాయిదా పడింది. కానీ, ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. మంచి సమయం వచ్చినప్పుడు తప్పకుండా మా పెళ్లి జరుగుతుంది’’ అని ఆమె చెప్పుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని