Samantha: ‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం

ప్రముఖ హీరోయిన్‌ సమంత తన కొత్త సినిమాని ప్రకటించారు.

Updated : 28 Apr 2024 17:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొత్త సినిమా అప్‌డేట్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ‘బంగారం’లాంటి కబురు చెప్పారు ప్రముఖ నటి సమంత (Samantha). తన పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం తదుపరి చిత్రం టైటిల్‌తో కూడిన పోస్టర్‌ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. సామ్‌ నటిస్తున్న ఆ మూవీ పేరు ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaram). పేరు సాఫ్ట్‌గా ఉన్నా పోస్టర్‌లో ఈ హీరోయిన్‌ లుక్‌ వైలెంట్‌గా ఉంది. తుపాకీ పట్టుకుని కనిపించి, సినిమాపై ఆసక్తి పెంచారు. మరి ఈ గృహిణి కథేంటి? తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. సామ్‌ టైటిల్‌ మినహా దర్శకుడు, సాంకేతిక బృంద వివరాలు పంచుకోలేదు. తన నిర్మాణ సంస్థ ‘ట్రా లా లా మూవింగ్‌ పిక్చర్స్‌’ (Tralala Moving Pictures)పై రూపొందుతున్న తొలి చిత్రమిదే కావడం విశేషం. ఈ సర్‌ప్రైజ్‌తో ఆమె ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘తలైవి ఈజ్‌ బ్యాక్‌’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

పెళ్లి గౌనును రీమోడల్‌ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్‌

అనారోగ్యం కారణంగా సమంత కొంతకాలం కొత్త చిత్రాలను ఖరారు చేయలేదు. చేతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసిన ఆమె ఇటీవల కాస్త బ్రేక్‌ తీసుకున్నారు. మయోసైటిస్‌ నుంచి కోలుకుని, మళ్లీ నటనపై దృష్టిపెట్టారు. గతేడాది సెప్టెంబరులో ‘ఖుషి’తో అలరించిన ఆమె.. వెబ్‌సిరీస్‌ ‘సిటడెల్‌: హనీ- బన్నీ’ (Citadel: Honey Bunny)తో త్వరలోనే సందడి చేయనున్నారు. బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్‌ హీరోగా రాజ్‌ అండ్‌ డీకే ఈ సిరీస్‌ని రూపొందించారు. ప్రముఖ ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో ఇది స్ట్రీమింగ్‌ కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని