Bollywood: వాళ్ల విడాకులు నన్నెంతో బాధించాయి.. వైరలవుతోన్న స్టార్‌ హీరో కుమార్తె కామెంట్స్‌

స్టార్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan) కుమార్తె ఐరా ఖాన్‌ (Ira Khan) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. తన తల్లిదండ్రుల విడాకుల నిర్ణయం తననెంతో బాధించిందని తెలిపింది.

Updated : 09 Jul 2023 13:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్టార్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan) మొదటి భార్య రీనా దత్తాతో ( Reena Dutta) విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో తాను మానసికంగా కుంగిపోయినట్లు వాళ్ల కుమార్తె ఐరా ఖాన్‌ (Ira Khan) తాజాగా తెలిపింది. ఇటీవల ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తన తల్లిదండ్రులు విడాకుల నిర్ణయం తననెంతో ప్రభావితం చేసిందని చెప్పింది.

‘‘అమ్మా-నాన్న విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు నేను విదేశాల్లో ఉన్నాను. విషయం తెలియగానే వెంటనే భారత్‌కు తిరిగి వచ్చాను. వాళ్లు స్నేహపూర్వకంగానే ఆ నిర్ణయం తీసుకున్నారని తెలిసినా.. నాకు మానసికంగా ఎంతో బాధ కలిగింది. నాలుగు రోజులు అన్నం కూడా తినలేదు. రోజులో ఎనిమిది గంటలు ఏడ్చేదాన్ని,  10 గంటలు నిద్రపోయేదాన్ని. ఏడాదిన్నరపాటు అలానే గడిపాను. నేను ఈ విషయాన్ని ఎవరితో పంచుకోలేదు. ఈ విషయం చెప్పి వాళ్లను కూడా బాధపెట్టడం నాకు ఇష్టం లేదు’’

‘‘మా కుటుంబంలో కొంతమంది మానసిన రుగ్మతలతో బాధపడుతున్నారు. అందుకే నేనూ చిన్న సమస్యను కూడా తట్టుకోలేక డిప్రెషన్‌కు వెళ్లాను. గతేడాది జులైలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాను. ఆ సమయంలో మందులు తీసుకోవడం మానేశాను. విపరీతంగా బరువు పెరిగాను. కానీ డిప్రెషన్‌ నుంచి బయటపడాలని నిర్ణయించుకున్నా. దానితో పోరాడడానికి నన్ను నేను సన్నద్ధం చేసుకున్నాను. ఇప్పుడు అంతా బాగుంది’’ అని ఆమిర్‌ ఖాన్‌ కుమార్తె ఐరా ఖాన్‌ చెప్పింది. ఇక ఆమిర్‌ ఖాన్‌ తన మొదటి భార్య రీనా దత్తాకు 2002లో విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత 2005లో కిరణ్‌రావును వివాహం చేసుకున్నారు. 15 ఏళ్లు కలిసి ఉన్న ఈ జంట 2021లో విడిపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని