Janhvi kapoor: నా పెళ్లి తిరుపతిలోనే..: జాన్వీకపూర్‌

పెళ్లి అనేది ప్రతి మనిషి జీవితంలోనూ ఓ కీలక ఘట్టం. సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకూ పెళ్లిపై ఎవరి కలలు వాళ్లకుంటాయి. సినిమా తారల పెళ్లయితే ఆ హంగామా వేరుగా ఉంటుంది...

Updated : 03 Aug 2021 10:14 IST

పెళ్లి అనేది ప్రతి మనిషి జీవితంలోనూ ఓ కీలక ఘట్టం. సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకూ పెళ్లిపై ఎవరి కలలు వాళ్లకుంటాయి. సినిమా తారల పెళ్లయితే ఆ హంగామా వేరుగా ఉంటుంది. ఈ మధ్య సినీ తారలు విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీకపూర్‌ మాత్రం తన పెళ్లి ఇక్కడే అంటోంది. నటిగా వడివడిగా అడుగులు వేస్తోన్న ఈ భామ గ్లామర్‌ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లోనూ సత్తా చాటుతోంది. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి మనసులో మాట బయటపెట్టింది. తన డ్రీమ్‌ వెడ్డింగ్‌ గురించి చెప్పుకొచ్చింది. ‘‘పెళ్లి తంతు రెండు మూడు రోజుల్లో ముగిసిపోవాలి. కాప్రి ఐల్యాండ్‌లో ఓ ప్రైవేట్‌ బోట్‌లో నా గ్యాంగ్‌తో కలిసి బ్యాచిలర్‌ పార్టీ చేసుకున్నాకా తిరుపతిలో నా పెళ్లి చేసుకుంటాను. మెహందీ, సంగీత్‌ కార్యక్రమాలు చెన్నైలోని మైలాపూర్‌లో ఉన్న అమ్మ నివసించిన ఇంటిలో జరగాలి. పెళ్లికి దక్షిణాది సంప్రదాయ చీర ధరించాలనేది నా కోరిక’’అని చెప్పింది. కాబోయేవాడు తెలివితేటలు ఉన్న వాడైతే చాలని చెప్పింది జాన్వీ. ఆమె ప్రస్తుతం ‘గుడ్‌ లక్‌ జెర్రీ’తో పాటు ఓ దక్షిణాది చిత్రం హిందీ రీమేక్‌లో నటిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని