Jayamma Panchayathi: సుమ కుదరదంటే.. ఈ చిత్రం చేయనన్నా

‘‘ప్రతి మహిళ అంతరంగం ‘జయమ్మ పంచాయితీ’.  కచ్చితంగా ప్రతి గుండెను తాకి తీరుతుంది’’ అన్నారు బలగ ప్రకాష్‌. ఆయన  నిర్మాణంలో సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన చిత్రమే ‘జయమ్మ పంచాయితీ’. విజయ్‌ కుమార్‌ కలివరపు తెరకెక్కించారు.

Updated : 05 May 2022 08:44 IST

‘‘ప్రతి మహిళ అంతరంగం ‘జయమ్మ పంచాయితీ’.  కచ్చితంగా ప్రతి గుండెను తాకి తీరుతుంది’’ అన్నారు బలగ ప్రకాష్‌. ఆయన  నిర్మాణంలో సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన చిత్రమే ‘జయమ్మ పంచాయితీ’. విజయ్‌ కుమార్‌ కలివరపు తెరకెక్కించారు. ఈ సినిమా ఈనెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత బలగ ప్రకాష్‌ ఇటీవల విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు.

‘‘దర్శకుడు కథ చెప్పిన వెంటనే జయమ్మ పాత్రకు సుమ సరిగ్గా సరిపోతారని చెప్పా. ఆమె వల్లే ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. ఆమె కుదరదంటే ఈ చిత్రం చేయకూడదనుకున్నా. ఇదొక అందమైన పల్లె కావ్యం. ప్రతి మహిళ అంతరంగానికి ప్రతిబింబంలా ఉంటుంది. కుటుంబంతో కలిసి హాయిగా చూడొచ్చు.  కె.విశ్వనాథ్‌, జంధ్యాల, బాపు వంటి దర్శక దిగ్గజాల చిత్రాల సరసన నిలిచే మానవీయ కథనం అవుతుంది. మా బ్యానర్‌కు చిరస్థాయిగా చెప్పుకొనే చిత్రమవుతుంది. ఒక్క మాటగా చెప్పాలంటే.. సుమమ్మ ఇకపై జయమ్మగా అందరికీ గుర్తుండిపోతుంది.’’

* ‘‘ఈ సినిమా మొత్తం శ్రీకాకుళంలోని సీతంపేట పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించాం. మా జిల్లాలోని రంగస్థల కళాకారులకు మంచి అవకాశం కల్పించడం నా బాధ్యత. అందుకే ఈ చిత్రం కోసం ఎక్కువగా అక్కడి నటీనటుల్నే తీసుకున్నాం. అందరూ చాలా బాగా నటించారు. కీరవాణి.. మా సినిమాకి సంగీతమందించడం గొప్ప ధైర్యాన్నిచ్చింది. మంచి కథనంతో విజయ్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు’’.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని