Indian2 : ‘భారతీయుడు2’.. మళ్లీ షురూ

కమల్‌హాసన్‌ - శంకర్‌ల క్రేజీ ప్రాజెక్ట్‌ ‘భారతీయుడు 2’ తిరిగి పట్టాలెక్కుతోంది. వచ్చే నెల నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని కాజల్‌ అగర్వాల్‌ స్వయంగా వెల్లడించింది. ఆమె ఈ ఏడాది    ఏప్రిల్‌లో ఓ మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

Updated : 05 Aug 2022 12:03 IST

కమల్‌హాసన్‌ (Kamal Haasan) - శంకర్‌ల (Shankar) క్రేజీ ప్రాజెక్ట్‌ ‘భారతీయుడు 2’ (Indian 2) తిరిగి పట్టాలెక్కుతోంది. వచ్చే నెల నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని కాజల్‌ అగర్వాల్‌ (Kajal) స్వయంగా వెల్లడించింది. ఆమె ఈ ఏడాది    ఏప్రిల్‌లో ఓ మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కారణంగానే కొన్నాళ్లుగా చిత్రీకరణలకు దూరంగా ఉంటున్న ఆమె.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె తన వెండితెర రీఎంట్రీపై స్పష్టత ఇస్తూ.. ‘భారతీయుడు2’ షూటింగ్‌ కబురును పంచుకుంది. ఈ సినిమా షూటింగ్‌ సెప్టెంబర్‌ 13న తిరిగి ప్రారంభమవుతుందని.. ఈ షెడ్యూల్‌తోనే తాను తిరిగి సెట్స్‌లోకి అడుగు పెట్టనున్నాని వెల్లడించింది. కమల్‌ - శంకర్‌ల కలయికలోనే వచ్చిన ‘భారతీయుడు’ సినిమాకి సీక్వెల్‌గా రూపొందుతోన్న చిత్రమిది. ఇప్పటికే దాదాపు 70శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. పలు కారణాలతో ఆగిపోయింది. ఇప్పుడా సమస్యలన్నీ తొలగడంతో తిరిగి చిత్రీకరణ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇప్పుడీ సినిమా తిరిగి మొదలవుతున్న నేపథ్యంలో శంకర్‌ - రామ్‌చరణ్‌ల కలయికలో రూపొందుతున్న ‘ఆర్‌సి15’ (వర్కింగ్‌ టైటిల్‌) చిత్రీకరణ కొన్నాళ్లు ఆగనున్నట్లు తెలుస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని