ఇలాంటి సినిమా తీసినందుకు సిగ్గుపడాలి.. ఇకనైనా డైరెక్షన్‌ ఆపెయ్‌: దర్శకుడిపై నటి ఆగ్రహం

రణ్‌వీర్‌ సింగ్‌, అలియా భట్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘రాకీ ఔర్‌ రాణీ కి ప్రేమ్‌ కహానీ’ (Rakhi aur Rani ki Prem Kahani). కరణ్‌ జోహార్‌ దర్శకుడు. తాజాగా ఈ చిత్రాన్ని విమర్శించారు నటి కంగన.

Updated : 30 Jul 2023 05:56 IST

ముంబయి: బాలీవుడ్‌ దర్శకుడు కరణ్‌ జోహార్‌ (Karan Johar)పై నటి కంగనా రనౌత్‌ (Kangana Ranaut) ఆగ్రహం వ్యక్తం చేశారు. కరణ్‌ దర్శకత్వం వహించిన ‘రాకీ ఔర్‌ రాణీ కి ప్రేమ్‌ కహానీ’ (Rakhi aur Rani ki Prem Kahani)ని విమర్శిస్తూ ఆమె ఇన్‌స్టాలో వరుస పోస్టులు పెట్టారు. కరణ్‌ దర్శకత్వం, రణ్‌వీర్‌ సింగ్‌ (Ranveer Singh) డ్రెస్సింగ్‌ స్టైల్‌పై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. రూ.250 కోట్లతో కరణ్‌ ఓ డైలీ సీరియల్‌ తీశారని ఎద్దేవాచేశారు.

ఏ పార్టీలోకి వెళ్లినా నేను ఎంపీగా గెలుస్తా: దిల్‌ రాజు కీలక వ్యాఖ్యలు

‘‘ప్రేక్షకులను ఇక మోసం చేయలేరు. ఇలాంటి ఫేక్‌ సెట్స్‌, కాస్ట్యూమ్స్‌ను వాళ్లు అంగీకరించరు. నిజ జీవితంలో ఎవరైనా అలాంటి దుస్తులు ధరిస్తారా? 90ల్లో తాను తెరకెక్కించిన చిత్రాలనే కాపీ కొట్టి రూ.250 కోట్ల బడ్జెట్‌తో సినిమా చేసినందుకు కరణ్‌ సిగ్గుపడాలి. టాలెంట్‌ ఉన్నవాళ్లు సరైన ఆర్థిక వనరులు దొరక్క ఇబ్బందిపడుతుంటే ఇంత డబ్బు ఆయనకు ఎవరు ఇచ్చారు? కరణ్‌.. ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డబ్బును వృధా చేయడం మానేసి.. రిటైర్‌ అయిపో. కొత్త టాలెంట్‌కు అవకాశాలు కల్పించు. రణ్‌వీర్‌కు నేనిచ్చే సూచన ఒక్కటే.. డ్రెస్సింగ్‌ విషయంలో దయచేసి కరణ్‌ను ఫాలో కావొద్దు. సాధారణ వ్యక్తుల మాదిరిగా దుస్తులు ధరించు. దక్షిణాది నటులు ఎంత హుందాగా దుస్తులు ధరిస్తారో చూడు’’ అని ఆమె రాసుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని