Published : 26 Apr 2022 01:39 IST

Tollywood:‘కేజీయఫ్‌2’ఎఫెక్ట్‌ ‘పుష్ప2’పై పడుతుందా?

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం భారతీయ సినిమాకు కేరాఫ్‌ అడ్రస్‌గా దక్షిణాది చిత్రాలు నిలుస్తున్నాయి. మేకింగ్‌, టేకింగ్‌, యాక్టింగ్‌ ఇలా ఏదైనా సరే ఈ చిత్రాలదే హవా. హిందీలోనూ ‘కేజీయఫ్‌2’(KGF2) దూసుకుపోతోంది. రాఖీభాయ్‌ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇప్పుడు ఈ చిత్ర ప్రభావం రాబోయే సినిమాలపై పడనుందా? అంటే అవుననే అంటున్నాయి చిత్ర వర్గాలు. ముఖ్యంగా రాబోయే సీక్వెల్స్‌పై దీని ప్రభావం చూపనుంది.

‘కేజీయఫ్‌: చాప్టర్‌1’కు కొనసాగింపుగా ‘కేజీయఫ్‌2’ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తొలి అధ్యాయంతో పోలిస్తే రెండో భాగంలో కథ, హీరో ఎలివేషన్స్‌ ఓ రేంజ్‌లో ఉన్నాయి. ‘హీరో పాత్ర తగ్గిపోతోంది’ అన్నప్పుడల్లా సడెన్‌గా ఓ ఎలివేషన్‌ సీన్‌ రావడం మళ్లీ ఆ పాత్ర తారస్థాయికి చేరడం ఇలా సినిమా మొత్తం సాగింది. ఇప్పుడు సీక్వెల్స్‌ తీసుకున్న దర్శకులకు ‘కేజీయఫ్‌2’ కొత్త తలనొప్పి తెచ్చింది. తొలి భాగంతో పోలిస్తే రెండో భాగం ఏమాత్రం డౌన్‌ అయినా ప్రేక్షకుడు జీర్ణించుకోలేడు. ఆ సినిమాకు ఈ సినిమాకూ మొదటి పార్ట్‌, రెండో పార్ట్‌ ఇలా ఉందంటూ చర్చలు మొదలవుతాయి. తెలుగులోకి వచ్చే సరికి ‘కేజీయఫ్‌’ మాదిరిగానే అల్లు అర్జున్‌(Allu arjun) ‘పుష్ప’(Pushpa: the rule) రెండో భాగం ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగంలో హీరో పాత్ర ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎర్రచందనం సిండికేట్‌ను శాసించే స్థాయికి చేరుకొంటుంది. ఇక ఈ స్థాయిని దాటి పుష్పరాజ్‌ సిండికేట్‌ను ఎలా రూల్‌ చేశాడో ‘పుష్ప: ది రూల్‌’లో చూపించనున్నారు. మరి రాఖీభాయ్‌కు పాత్రను చూపించినట్లే ఫుల్ ఎలివేషన్స్‌తో ‘పుష్ప రాజ్‌’ పాత్ర ఉంటుందా? ఎర్రచందనం సిండికేట్‌ను ఎలా నడిపించాడు? భన్వర్‌ సింగ్‌ షెకావత్‌, మంగళం శ్రీనులను ఎదుర్కొన్నాడు? ప్రస్తుతం ప్రేక్షకులను తొలిచేస్తున్న ప్రశ్నలివే. చిత్ర బృందం కూడా అభిమానుల అంచనాలను అందుకునేలా సన్నివేశాలను రాసుకుంటోందని సమాచారం.

సుకుమార్‌ మార్క్‌ శైలి పోకుండా పుష్పరాజ్‌ పాత్రను మరింత ఎలివేట్‌ చేసేలా కథ, కథనాలు ఉండనున్నాయని సమాచారం. మరోవైపు అభిమానులు కూడా తొలి భాగానికి మించి ‘పుష్ప2’లో అల్లు అర్జున్‌ పాత్ర ఉంటుందని ఆశిస్తున్నారు. మరి సుకుమార్‌ ఏం చేస్తారో చూడాలి. అన్నట్లు ‘పుష్ప2’కు సంబంధించి మరో వార్త కూడా టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో కీలక పాత్రలో బాలీవుడ్‌ నటుడు సునీల్‌శెట్టి నటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన కూడా ఓ సీనియర్‌ పోలీస్‌ అధికారిగా కనిపించనున్నారట.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని