Andhra news: సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఈసీ ఆదేశం

వైకాపా సోషల్‌మీడియా ఇన్‌ఛార్జి సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఎన్నికల సంఘం ఆదేశించింది.

Published : 05 May 2024 17:52 IST

అమరావతి: వైకాపా సోషల్‌మీడియా ఇన్‌ఛార్జి సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఎన్నికల సంఘం ఆదేశించింది. సామాజిక మాధ్యమాల్లో చంద్రబాబుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ తెదేపా సీనియర్‌ నేత వర్ల రామయ్య ఈసీకి ఫిర్యాదు చేశారు. ఇంటింటికీ పింఛన్లు అందకపోవడానికి చంద్రబాబే కారణమంటూ ఐవీఆర్‌ఎస్‌ ద్వారా ఓటర్లు, పింఛనుదారులను తప్పుదోవ పట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తెదేపా ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న ఈసీ.. విచారణ చేసి వెంటనే నివేదిక ఇవ్వాలని సీఐడీ డీజీని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని