Kiara Advani: ఆ ఒక్క విషయంలో ఎలాంటి మార్పులేదు

‘భరత్‌ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ లాంటి చిత్రాలతో మంచి విజయాన్ని సొంతం చేసుకొని తెలుగు అభిమానులకు దగ్గరైంది బాలీవుడ్‌ కథానాయిక కియారా అడ్వాణీ.

Updated : 20 Oct 2023 12:25 IST

‘భరత్‌ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ లాంటి చిత్రాలతో మంచి విజయాన్ని సొంతం చేసుకొని తెలుగు అభిమానులకు దగ్గరైంది బాలీవుడ్‌ కథానాయిక కియారా అడ్వాణీ. 2014లో ‘ఫగ్లీ’ సినిమాతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె తన నటనకు మంచి ప్రశంసల్ని అందుకుటోంది. ఈ ఏడాది విడుదలైన ‘సత్యప్రేమ్‌ కీ కథా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ నటి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. వచ్చే ఏడాదితో సినీరంగంలో పదేళ్లను విజయవంతంగా పూర్తి చేసుకోనున్న కియారా పంచుకున్న సంగతులు...


నాలుగు కాదు పది

నాతో కలిసి పని చేయాలనుకునే వారిని కలిసినప్పుడు, నన్ను దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకుంటున్నారన్న విషయం తెలిసినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పటివరకూ చాలా మారాయి. కానీ మొదటి నుంచి సినిమాల పట్ల నేను తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో ఎలాంటి మార్పు లేదు. నాలుగు కథలకు బదులు పది స్క్రిప్ట్‌లను ఎంచుకుంటున్నాను అంతే.


అది అనుభవం మాత్రమే

సినిమాలు చేయడం ఒక పెద్ద కమిట్‌మెంట్‌. కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటాను. ఉత్తేజకరమైన కథా కాదా అనేది ముందే చూసుకుంటాను. తెర వెనక ఎంతో మంది పెట్టుబడి, కష్టం, కృషి ఉంటుంది. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చిత్రాలు చేయాలి. ఆ సినిమా ఎలా ఉన్నా, ఏం జరిగిన జీవితంలో ఎదురైన ఒక అనుభవంలాగే ఫీల్‌ అవుతాను.


సంతృప్తినిచ్చిన పాత్రలవి

మొదట్లో కథను ఎంచుకునే విషయంలో చాలా కష్టం అనిపించేంది. ఇప్పటికి కూడా(నవ్వుతూ). దాని ద్వారా ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాను. ఏది చేసిన కొంచెం భిన్నంగా చేయాలనే ఆలోచనతో నాకు నచ్చిన నిర్ణయాలు తీసుకుంటాను. ‘లస్ట్‌ స్టోరీస్‌’, ‘కబీర్‌ సింగ్‌’ సినిమాల్లోని పాత్రలకు ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఈ పాత్రల ఎంపిక ద్వారా నా ఆలోచనల విధానం ఎలా ఉందని తెలిసింది. ఈ పాత్రలు నాకు చాలా సంతృప్తినిచ్చాయి.


ఇక దానిపైనే మా దృష్టి

పెళ్లికాకముందు నుంచే సిద్ధార్థ్‌.. నేను మా బంధాన్ని కాపాడుకోవాలనుకున్నాం. కానీ ఇప్పుడు నటీనటులుగా మాకున్న గుర్తింపును కాపాడుకోవడంపై దృష్టిపెట్టాం. సినీరంగంలో మాకు ఓ మంచి స్థానాన్ని సంపాదించుకున్నాం. దీని కోసం మేము చాలా కష్టపడ్డాం. మా వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టి ప్రేక్షకుల అభిమానానికి దూరంగా ఉండాలనుకోవట్లేదు. మాపై వారికున్న ప్రేమ ఎప్పటికీ అలాగే ఉండాలని ఆశిస్తున్నాను.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని