Naga Chaitanya: ‘ధూత’ వస్తున్నాడు

నాగచైతన్య ఓటీటీ వేదికపైకి అడుగు పెడుతున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో ‘ధూత’ అనే సిరీస్‌ రూపొందింది. హారర్‌ కథతో రూపొందిన ఆ సిరీస్‌ని అధికారికంగా ప్రకటించింది

Updated : 29 Apr 2022 14:00 IST

నాగచైతన్య ఓటీటీ వేదికపైకి అడుగు పెడుతున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో ‘ధూత’ అనే సిరీస్‌ రూపొందింది. హారర్‌ కథతో రూపొందిన ఆ సిరీస్‌ని అధికారికంగా ప్రకటించింది అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సంస్థ. నాగచైతన్య ఓ కొత్త రకమైన గెటప్‌లో దర్శనమిస్తారని తెలుస్తోంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సంస్థ వివిధ భారతీయ భాషల్లో రూపొందిన పలు ప్రాజెక్ట్‌ల్ని గురువారం ప్రకటించింది. అందులో భాగంగానే ‘ధూత’ని పరిచయం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని