Naveen Polishetty: అప్పుడు నేనూ విజయ్ దేవరకొండ నిరాశకు గురయ్యాం: నవీన్ పొలిశెట్టి
తన కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను నటుడు నవీన్ పొలిశెట్టి తాజాగా వెల్లడించారు. విజయ్ దేవరకొండతో ఇప్పటికీ మంచి అనుబంధం ఉందని చెప్పారు.
హైదరాబాద్: హీరోగా ఎదిగే క్రమంలో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని నటుడు నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) తెలిపారు. ముంబయిలో అవకాశాల కోసం ప్రయత్నించిన రోజుల్లో కడుపునిండా భోజనం తినడానికి కూడా డబ్బుల్లేక బాధపడ్డానన్నారు. ఇక్కడ సక్సెస్ కంటే ముందు ఇలాంటి ఎన్నో కష్టాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని.. కాబట్టి సినిమా పరిశ్రమలోకి వచ్చేవారు వీటికి ముందుగానే సిద్ధపడాలని తెలిపారు. అనంతరం బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ గురించి మాట్లాడుతూ.. అతడు చనిపోయిన సమయంలో తాను ఎంతో బాధకు గురయ్యానని అన్నారు. ఆ బాధ నుంచి బయటకు రావడానికి రెండు నెలల సమయం పట్టిందన్నారు.
Jawan ott release: కొత్త సీన్స్‌తో ‘జవాన్’ ఓటీటీ రిలీజ్.. అట్లీ సూపర్ ప్లాన్
‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ రోజులను గుర్తుచేసుకుంటూ.. ‘‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’లో నేనూ విజయ్ దేవరకొండ చిన్న రోల్స్ పోషించాం. హీరో పాత్ర కోసం మేమిద్దరం ఆడిషన్‌కు వెళ్లాం. చిన్న రోల్స్ ఇచ్చారు. అప్పుడు కాస్త నిరాశకు గురయ్యాం. అక్కడి నుంచి ఈ స్థాయి దాకా మేము రాగలిగామంటే ప్రేక్షకుల ఆదరణే కారణం. ఇప్పటికే మేమిద్దరం తరచూ మెస్సేజ్‌లు చేసుకుంటూ ఉంటాం’’ అని ఆయన తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
PM modi: గహ్లోత్‌కు ఓటమి తప్పదని అర్థమైంది: మోదీ
-
Mexico: చర్చి పైకప్పు కుప్పకూలి.. ముగ్గురు చిన్నారులు సహా 10 మంది మృతి!
-
Nara Bhuvaneswari: నాన్న జ్ఞాపకాలతో నా హృదయం నిండిపోయింది: నారా భువనేశ్వరి ట్వీట్
-
Disease X: ‘డిసీజ్ ఎక్స్’ ముప్పు.. దొంగ వస్తాడని భయపడటం లాంటిదే..!
-
పార్కులో జంటను బెదిరించి.. యువతిపై పోలీసుల లైంగిక వేధింపులు
-
Chiranjeevi: ఛారిటబుల్ ట్రస్ట్‌కు 25 ఏళ్లు.. చిరంజీవి ఆసక్తికర పోస్ట్