Pathan: ఆలస్యమే అయినప్పటికీ డేట్‌ మర్చిపోవద్దు: షారుఖ్‌ ఖాన్‌

బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ ఖాన్‌ హీరోయిజాన్ని తిరిగి వెండితెరపై చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ‘జీరో’ పరాజయం తర్వాత సుమారు మూడేళ్ల నుంచి ఆయన ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయ....

Published : 02 Mar 2022 15:09 IST

ముంబయి: బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ ఖాన్‌ హీరోయిజాన్ని తిరిగి వెండితెరపై చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ‘జీరో’ పరాజయం తర్వాత సుమారు మూడేళ్ల నుంచి ఆయన ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ‘పఠాన్‌’ సినిమాలో నటిస్తున్నారు. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల అవుతుందని ఆశించిన అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేస్తామని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

‘పఠాన్‌’ నుంచి ఓ స్పెషల్‌ వీడియోని షేర్‌ చేసిన షారుఖ్‌.. ‘‘ఆలస్యమేనని నాక్కూడా తెలుసు. కానీ, ‘పఠాన్‌’ టైమ్‌ ఇప్పుడే మొదలైంది. వచ్చే ఏడాది జనవరి 25న థియేటర్లలో కలుసుకుందాం’’ అని పోస్ట్‌ పెట్టారు. సూపర్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా సిద్ధమవుతోంది. ఇందులో షారుఖ్‌.. విభిన్నమైన లుక్‌లో పొడవాటి జుట్టుతో కనిపించనున్నారు. దీపికా పదుకొణె, జాన్‌ అబ్రహాం కీలకపాత్రలు పోషిస్తున్నారు. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సల్మాన్‌ఖాన్‌ అతిథి పాత్రలో మెరవనున్నారు. హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో ఈసినిమా విడుదల కానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని