Prabhas: ప్రభాస్‌ అభిమానులకు విజువల్‌ ట్రీట్‌.. ఐమాక్స్‌లో ‘సలార్‌’

ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతోన్న ‘సలార్‌’పై ఓ అప్‌డేట్ నెట్టింట వైరలవుతోంది. ఈ సినిమా ఐమాక్స్‌ వెర్షన్‌లో అలరించనుంది.

Updated : 18 Aug 2023 11:26 IST

హైదరాబాద్‌: ప్రభాస్‌ (Prabhas) హీరోగా ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్న సినిమా ‘సలార్‌’ (Salaar). దీని విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు మేకర్స్‌ ఓ పండగలాంటి వార్త చెప్పారు. ఈ సినిమాను ఐమాక్స్‌ ఫార్మాట్లోనూ విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు.

ఈ విషయాన్ని తెలుపుతూ ‘సలార్’ అమెరికన్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ ట్వీట్‌ చేశారు. ఈ ఐమాక్స్‌ వెర్షన్‌ టికెట్‌ బుకింగ్స్‌ కూడా త్వరలోనే ఓపెన్‌ చేయనున్నట్లు తెలిపారు. అయితే ఇండియాలో ఇది అందుబాటులో ఉంటుందా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ ఇక్కడా కూడా ఐమాక్స్‌ వెర్షన్‌లో రిలీజ్‌ చేస్తే మూవీ క్వాలిటీ అభిమానులను ఆకట్టుకుంటుందని ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ప్రభాస్‌ నటించిన ‘ఆదిపురుష్‌’ను ఈ వెర్షన్‌లో విడుదల చేద్దామని మేకర్స్‌ భావించారు. కానీ, కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. ఇక  తెలుగులో మొదటిసారి ఐమాక్స్‌ వెర్షన్‌లో విడుదలైన సినిమా ‘బాహుబలి2’. ఇప్పుడు ‘సలార్‌’ వస్తే ఇది రెండో సినిమా అవుతుంది.

ఓటీటీలో ‘బేబీ’ మూవీ.. స్ట్రీమింగ్‌ తేదీ ఫిక్స్‌.. వాళ్లకు స్పెషల్‌!

‘కేజీఎఫ్‌’తో సూపర్‌ హిట్‌ను అందుకున్న ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) ఇప్పుడు దానికి రెట్టింపు రేంజ్‌లో ‘సలార్‌’ను రూపొందిస్తున్నారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌తో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కమర్షియల్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఐదు భాషల్లో రానున్న ఈ సినిమాలో జగపతిబాబు, ఈశ్వరీరావు, శ్రియారెడ్డి తదితరులు కీలకపాత్రలో నటిస్తున్నారు. సెప్టెంబరు 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే ‘సలార్‌’ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. అందులో యాక్షన్‌ సీక్వెన్స్‌లు, ఎలివేషన్స్‌ బాగా చూపించనున్నారని టాక్‌ వినిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని