Game Changer: అక్టోబరు నుంచి ‘గేమ్‌ ఛేంజర్‌’ కొత్త షెడ్యూల్‌

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’.

Updated : 25 Sep 2023 13:55 IST

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న సంగతి తెలిసిందే. కొద్దిమంది కళాకారులు అందుబాటులో లేనందున ఈ సెప్టెంబరు షెడ్యూల్‌ను రద్దు చేశారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ఆదివారం సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది. అక్టోబరు రెండో వారంలో మళ్లీ చిత్రీకరణ ప్రారంభమవుతుందని ప్రకటించింది. రాజకీయ అంశాలతో ముడిపడి ఉన్న యాక్షన్‌ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో చరణ్‌ భిన్న కోణాలున్న పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ఎస్‌.జె.సూర్య, శ్రీకాంత్‌, అంజలి, జయరామ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ సంగీతమందిస్తున్నారు. తిరు ఛాయాగ్రాహకుడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని