Rashmika: అలా చేస్తే.. శిక్ష తప్పదు

రష్మిక  డీప్‌ ఫేక్‌ వీడియో సూత్రధారి పోలీసులకు పట్టుబడ్డాడు. దీనిపై ఆమె స్పందిస్తూ.. ‘దిల్లీ పోలీసులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. .. బాధ్యులైన వారిని పట్టుకున్నందుకు ధన్యవాదాలు. ఈ కష్టకాలంలో నా వెనకాల ఉండి ధైర్యం చెప్పిన, నాకు రక్షణగా నిలిచిన, నాపై ప్రేమాభిమానాలు చూపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అంటూ ఆదివారం తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా వేదికగా షేర్‌ చేశారు.

Updated : 22 Jan 2024 10:53 IST

ష్మిక  డీప్‌ ఫేక్‌ వీడియో సూత్రధారి పోలీసులకు పట్టుబడ్డాడు. దీనిపై ఆమె స్పందిస్తూ.. ‘దిల్లీ పోలీసులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. .. బాధ్యులైన వారిని పట్టుకున్నందుకు ధన్యవాదాలు. ఈ కష్టకాలంలో నా వెనకాల ఉండి ధైర్యం చెప్పిన, నాకు రక్షణగా నిలిచిన, నాపై ప్రేమాభిమానాలు చూపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అంటూ ఆదివారం తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా వేదికగా షేర్‌ చేశారు. అమ్మాయైనా, అబ్బాయైనా.. ఒకరి అనుమతి లేకుండా వారి ఫొటో, వీడియో మార్ఫింగ్‌ చేస్తే.. తప్పకుండా శిక్షకు గురి కావాల్సి ఉంటుంది. అలాంటి వాళ్లకు ఇదొక హెచ్చరిక అన్నారు. గతేడాది నవంబరులో బ్రిటీష్‌ ఇండియన్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ జారా పటేల్‌ వీడియో ఆధారంగా.. రష్మికది ఒక అసభ్యకరమైన డీప్‌ఫేక్‌ వీడియోని సృష్టించారు. అప్పట్లో ఇది దేశవ్యాప్తంగా సంచలనానికి కారణమైంది. దీనికి వెనక 23ఏళ్ల గుంటూరు వాసి ఉన్నట్టు పోలీసులు తేల్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని