Vikram Vedha: ‘విక్రమ్‌ వేద’ టీజర్‌.. అదరగొట్టేసిన హృతిక్‌, సైఫ్‌

బాలీవుడ్‌ స్టార్‌హీరోలు హృతిక్‌ రోషన్ (Hrithik Roshan)‌, సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘విక్రమ్‌ వేద’....

Published : 24 Aug 2022 12:35 IST

ముంబయి: బాలీవుడ్‌ స్టార్‌హీరోలు హృతిక్‌ రోషన్ (Hrithik Roshan)‌, సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘విక్రమ్‌ వేద’ (Vikram Vedha). యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ఈ సినిమా టీజర్‌ను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది. ‘‘మీకో కథ చెప్పమంటారా సర్‌.. జాగ్రత్తగా, ఓపికగా వినండి. ఈసారి కథ కేవలం సరదాగా మాత్రమే ఉండదు. ఇందులో ఓ సర్‌ప్రైజ్‌ కూడా ఉంది. మంచి చెడులలో ఏదో ఒక దాన్ని ఎంచుకోవడం ఎంతో సులభం. కానీ ఈ కథలో ఇద్దరూ చెడ్డవారే’’ అంటూ హృతిక్‌ చెప్పే సంభాషణలతో సాగే ఈ టీజర్‌ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా సైఫ్‌, గ్యాంగ్‌స్టర్‌గా హృతిక్‌ అదరగొట్టేలా నటించారు. విజువల్స్‌కు అనుగుణంగా సాగిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌.. టీజర్‌ను మరోస్థాయికి తీసుకువెళ్లింది.

మాధవన్‌, విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్‌హిట్‌ చిత్రం ‘విక్రమ్‌ వేద’కు రీమేక్‌ ఇది. మాతృకను తెరకెక్కించిన పుష్కర్‌, గాయత్రి ద్వయమే ఈ హిందీ సినిమాకూ దర్శకత్వం వహించింది. ఎస్‌.శశికాంత్‌, భూషణ్‌ కుమార్‌ నిర్మించారు. రాధికా ఆప్టే కీలక పాత్ర పోషించారు. సెప్టెంబర్‌ 30న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని