Chor Bazaar: చూడగానే కళ్లు చెదిరి
ఆకాష్ పూరి కథానాయకుడిగా జీవన్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘చోర్ బజార్’. వీ.ఎస్.రాజు నిర్మిస్తున్నారు. గెహన సిప్పీ కథానాయిక. సురేష్ బొబ్బిలి స్వరాలందించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు
ఆకాష్ పూరి కథానాయకుడిగా జీవన్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘చోర్ బజార్’. వీ.ఎస్.రాజు నిర్మిస్తున్నారు. గెహన సిప్పీ కథానాయిక. సురేష్ బొబ్బిలి స్వరాలందించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం ఈ చిత్ర రెండో గీతాన్ని విడుదల చేశారు. ‘‘అబ్బబ్బ అది ఏం పోరి.. చూడగానే కళ్లు చెదిరి..’’ అంటూ సాగుతున్న ఈ మెలోడీ పాటకు మిట్టపల్లి సురేందర్ సాహిత్యమందించగా.. రామ్ మిర్యాల ఆలపించారు. భాను నృత్యరీతులు సమకూర్చారు. పాటలో ఆకాష్తో పాటు సీనియర్ నటి అర్చన కనిపించారు. ‘‘విభిన్నమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ఆకాష్ కనిపించే తీరు.. ఆయన పలికే సంభాషణలు కొత్తగా ఉంటాయి. త్వరలో సినిమాని విడుదల చేస్తాం’’ అంది చిత్రబృందం తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!
-
లఖ్నవూ చిత్తు.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లిన కోల్కతా
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
‘మాకు పిల్లలు లేరు’.. వారి భవిష్యత్తు కోసమే మా తపన: మోదీ
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్