
Nikhil: ‘స్పై’.. యాక్షన్ షురూ
నిఖిల్ హీరోగా నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం ‘స్పై’. ఎడిటర్ గ్యారీ బిహెచ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కె.రాజ శేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఐశ్వర్య మేనన్ కథానాయిక. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. ఇందులో భాగంగా హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ లీ విటేకర్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం శనివారం సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది. ఈ సందర్భంగా సెట్లో దిగిన ఓ ఫొటోను నెట్టింట పంచుకున్నారు. ఆ ఫొటోలో నిఖిల్, ఐశ్వర్య, ఇతర నటీనటులతో పాటు హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ జూలియన్ ఎస్ట్రాడా, బాలీవుడ్ ఛాయాగ్రాహకుడు కైకో నకహరా కనిపించారు. ‘‘ఈ చిత్రాన్ని పూర్తి యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా భారీ స్థాయిలో రూపొందిస్తున్నాం. నిఖిల్ సరికొత్త లుక్‌తో.. భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ ఏడాది దసరాకు సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. మకరంద్ దేశ్‌పాండే, సన్యా ఠాకూర్, జిషు సేన్ గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల స్వరాలందిస్తున్నారు. జూలియన్ ఎస్ట్రాడా ఛాయాగ్రాహకుడు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
OTT: 50 రోజుల తర్వాతే ఓటీటీలోకి సినిమాలు.. నిర్మాత కీలక నిర్ణయం
-
Sports News
Hanuma vihari : మన దగ్గర పోటీ ఎక్కువ.. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌కు సిద్ధమే: హనుమ విహారి
-
India News
Union Cabinet: 63వేల PACSల కంప్యూటరీకరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం
-
Sports News
ENG vs IND: ఆ ‘తుపాన్’ మన మీదకొస్తే..!
-
General News
Andhra News: అమరావతి సచివాలయ ఉద్యోగులకు ఉచిత వసతి రద్దు
-
Politics News
AP High court: ఎంపీ రఘురామ కృష్ణరాజు సీఐడీ విచారణకు హైకోర్టు అనుమతి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Actress Meena: ఊపిరితిత్తుల సమస్యతో నటి మీనా భర్త మృతి
- Archana Shastry: అందుకే ‘మగధీర’లో నటించలేదు.. అర్చన కన్నీటి పర్యంతం
- Actress Meena: మీనా భర్త మృతి.. పావురాల వ్యర్థాలే కారణమా..?
- Plastic Ban: జులై 1 నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం.. ఏయే వస్తువులంటే..!
- Udaipur Murder: భగ్గుమన్న ఉదయ్‌పుర్
- IND vs IRE : అందుకే ఆఖరి ఓవర్‌ను ఉమ్రాన్‌కు ఇచ్చా : హార్దిక్ పాండ్య
- DilRaju: తండ్రైన దిల్‌రాజు.. మగబిడ్డకు జన్మనిచ్చిన తేజస్విని
- ఒత్తిళ్లకు లొంగలేదని బదిలీ బహుమానం!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (29-06-22)
- IND vs IRE : గెలిచారు.. అతి కష్టంగా