Srinivas Avasarala: ఆ హీరో ఫోన్‌ చేసి అభినందిస్తే ‘సర్‌ మీ పేరేంటి’ అని అడిగా!

Srinivas Avasarala: ఆలీతో సరదాగా కార్యక్రమంలో అవసరాల శ్రీనివాస్‌ పంచుకున్న కొన్ని ఆసక్తికర విశేషాలు..

Updated : 01 Sep 2021 15:11 IST

హైదరాబాద్‌: ‘నూటొక్క జిల్లాల అందగాడు’లో బట్టతలతో కనిపించేందుకు నిజంగానే గుండు చేయించుకున్నానని నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్‌ అన్నారు. ఆయన కీలక పాత్రలో విద్యాసాగర్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. సెప్టెంబరు 3న ఈ చిత్రం థియేటర్‌లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదా’గా కార్యక్రమానికి విచ్చేసిన శ్రీనివాస్‌ ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఉద్యోగాన్ని వదులుకుని సినిమాపై ప్యాషన్‌తో తాను ఇండస్ట్రీకి వచ్చినట్లు తెలిపారు. సినిమా అంటే చాలా ఇష్టమన్నారు. అయితే, ‘సినిమా తీయడం అంత సాధ్యం కాదు’ అని ఎవరు చెప్పినా వినలేదన్నారు. ‘అష్టాచమ్మా’ ఆడిషన్స్‌లో సెలక్ట్‌ అయి, సినిమా ట్రైలర్‌ వచ్చే వరకూ తాను అందులో నటించినట్లు అమ్మానాన్నలకు కూడా చెప్పలేదని శ్రీనివాస్‌ చెప్పుకొచ్చారు. ఈ సినిమా విడుదలైన తర్వాత తన నటన చూసి రవితేజ ఫోన్‌చేసి అభినందిస్తే, ఫోన్‌లో మాట్లాడేది ఆయనే అని తెలియక ‘సర్‌ మీ పేరేంటి’ అని అడిగానని ‘నన్ను రవితేజ అంటారండీ’ అంటూ ఆయన నవ్వేశారని శ్రీనివాస్‌ చెప్పారు. ఇలా అవసరాల శ్రీనివాస్‌ పంచుకున్న ఆసక్తికర విశేషాలు తెలియాలంటే సెప్టెంబరు 6వ తేదీ వరకూ వేచి చూడాల్సిందే. అప్పటి వరకూ ఈ ప్రోమో చూసేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని