Suriya: ‘ఈటి’ వచ్చేది ఎప్పుడంటే...

‘ఆకాశమే హద్దురా’, ‘జై భీమ్‌’ చిత్రాలతో ఓటీటీ వేదికగా వరుస విజయాలు అందుకున్నారు కథానాయకుడు సూర్య. ఇప్పుడు ‘ఈటి’తో వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Updated : 02 Feb 2022 06:59 IST

‘ఆకాశమే హద్దురా’, ‘జై భీమ్‌’ చిత్రాలతో ఓటీటీ వేదికగా వరుస విజయాలు అందుకున్నారు కథానాయకుడు సూర్య. ఇప్పుడు ‘ఈటి’తో వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. పాండిరాజ్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రమిది.  సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈనెల 4నే విడుదల కావాల్సిన ఈ సినిమా కొవిడ్‌ పరిస్థితుల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీన్ని మార్చి 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం విడుదల తేదీతో కూడిన కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఆ పోస్టర్‌లో సూర్య కత్తి పట్టుకుని సీరియస్‌గా నడిచొస్తూ కనిపించారు. ఈ  సినిమాలో సూర్యకు జోడీగా ప్రియాంక అరుళ్‌ మోహన్‌ నటిస్తోంది. వినయ్‌రామ్‌, సత్యరాజ్‌, జయప్రకాశ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డి.ఇమ్మాన్‌ స్వరాలందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని