Tollywood Drugs Case: సినీనటుడు రవితేజను 6గంటల పాటు ప్రశ్నించిన ఈడీ 

టాలీవుడ్‌ మాదకద్రవ్యాల కేసులో నిధుల మళ్లింపునకు సంబంధించి సినీ ప్రముఖులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో

Updated : 09 Sep 2021 18:31 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌ మాదకద్రవ్యాల కేసులో నిధుల మళ్లింపునకు సంబంధించి సినీ ప్రముఖులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ నటుడు రవితేజ, ఆయన వ్యక్తిగత డ్రైవర్‌ శ్రీనివాస్‌ను ఈడీ అధికారులు దాదాపు ఆరు గంటల పాటు ప్రశ్నించారు. మనీ లాండరింగ్‌ కోణంలో ఆయన బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలించారు. అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీసినట్టు సమాచారం. డ్రగ్స్‌ విక్రేత కెల్విన్‌తో ఏమైనా పరిచయం ఉందా? ఆయన అకౌంట్‌కు ఎప్పుడైనా భారీ మొత్తంలో నిధులు పంపించారా? అనే విషయాలతోపాటు ఎఫ్‌క్లబ్‌ గురించి ప్రశ్నించినట్టు తెలుస్తోంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని