Tollywood Drugs Case: ముగిసిన నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఈడీ విచారణ

తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపిన మాదకద్రవ్యాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణ వేగవంతం చేసింది. శుక్రవారం ఉదయం...తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపిన మాదకద్రవ్యాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణ వేగవంతం చేసింది. శుక్రవారం ఉదయం

Published : 03 Sep 2021 16:53 IST

హైదరాబాద్‌: తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపిన మాదకద్రవ్యాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణ వేగవంతం చేసింది. శుక్రవారం ఉదయం నుంచి దాదాపు 6గంటల పాటు ప్రముఖ నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. రకుల్‌ బ్యాంకు ఖాతాలను పరిశీలించిన అధికారులు.. లావాదేవీలపై ప్రశ్నించినట్టు సమాచారం. డ్రగ్స్‌ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్‌, నటి ఛార్మిలను సుదీర్ఘంగా ఈడీ అధికారులు విచారించారు.  

డ్రగ్స్‌ కేసులో మనీ లాండరింగ్ చట్టం కింద సినీరంగానికి చెందిన 12 మందికి ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌ విచారణకు హాజరయ్యారు. షూటింగ్స్‌ ఉండటంచేత తాను విచారణకు హాజరు కాలేకపోతున్నానని.. కాస్త గడువు ఇవ్వాలని ఈడీ అధికారులను రకుల్‌ కోరారు. అందుకు అంగీకరించని అధికారులు.. మూడు రోజుల ముందుగానే  ఆమెను విచారించారు. మరోవైపు 8న రానా ఈడీ విచారణకి రానున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని