MAA Elections: ఆ ప్యానెల్‌కే నా ఓటు: రోజా

ఈసారి జరగబోయే మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయని సినీ నటి, ఎమ్మెల్యే రోజా అన్నారు. శుక్రవారం ఉదయం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ‘మా’ ఎన్నికలపై స్పందించారు....

Published : 08 Oct 2021 14:53 IST

‘మా’ ఎన్నికలపై స్పందించిన నటి

హైదరాబాద్‌: ఈసారి జరగబోయే మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్(మా) ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయని సినీ నటి, ఎమ్మెల్యే రోజా అన్నారు. శుక్రవారం ఉదయం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ‘మా’ ఎన్నికలపై స్పందించారు. ‘మా’ ఎన్నికలు ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారాయని అన్నారు. అంతేకాకుండా తాను ఎవరికి ఓటు వేయనున్నారనే విషయంపై స్పందించారు. ‘‘ఈసారి ‘మా’ ఎన్నికలు ఎంతో హోరాహోరీగా సాగుతున్నాయి. సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. లోకల్‌, నాన్‌ లోకల్‌ వివాదం గురించి నేను ఏం మాట్లాడాలనుకోవడం లేదు. రెండు ప్యానెల్స్ మేనిఫెస్టోలు చూశాను. అభివృద్ధి చేసే ప్యానెల్‌కే నా ఓటు వేస్తాను’’ అని రోజా తెలిపారు.

అక్టోబర్‌ 10న జూబ్లీహిల్స్ పబ్లిక్‌ స్కూల్‌లో ‘మా’ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు హోరాహోరీగా తలపడుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో విజయం సాధించేందుకు అటు ప్రకాశ్‌రాజ్‌.. ఇటు మంచు విష్ణు ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని