Brahmanandam: కృష్ణంరాజుకి బ్రహ్మానందం స్పెషల్‌ సర్‌ప్రైజ్‌

రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజుకు ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. శనివారం ఉదయం కృష్ణంరాజు ఇంటికి వెళ్లారు. ఆయనతో కొంతసమయంపాటు సరదాగా మాట్లాడారు...

Published : 30 Oct 2021 13:19 IST

హైదరాబాద్‌: రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజుకు ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. శనివారం ఉదయం కృష్ణంరాజు ఇంటికి వెళ్లారు. ఆయనతో కొంతసమయం సరదాగా మాట్లాడారు. అనంతరం తాను గీసిన సాయిబాబా చిత్రపటాన్ని బహుమతిగా అందించారు. ఈ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ పట్ల కృష్ణంరాజు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ట్విటర్‌ వేదికగా ఫొటోలు షేర్‌ చేశారు. ‘‘మన కామెడీ జీనియస్‌.. ఆర్ట్‌లోనూ జీనియస్సే. అద్భుతమైన టాలెంట్‌ కలిగిన మంచి వ్యక్తి మన బ్రహ్మానందం. థ్యాంక్యూ ఫర్‌ ది స్పెషల్‌ సర్‌ప్రైజ్‌’’ అని పేర్కొన్నారు. మరోవైపు నటులు అల్లు అర్జున్‌, రానాలకూ తాను స్వయంగా గీసిన దేవుడి చిత్రపటాలను బ్రహ్మానందం అందించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని