
Updated : 30 Dec 2021 12:45 IST
Pushpa: దాక్కో దాక్కో మేక.. ఫుల్ వీడియో వచ్చేసింది..!
హైదరాబాద్: ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన ‘పుష్ప’ ఇటీవల విడుదలై విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్ పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేశారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళ్తోన్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ స్పెషల్ గిఫ్ట్ బయటకు వచ్చింది. ‘పుష్ప’ నుంచి మొదటి వీడియో సాంగ్ విడుదలైంది. ‘దాక్కో దాక్కో మేక’ అంటూ సాగే ఈ పాటలో బన్నీ మేనరిజం వావ్ అనేలా ఉంది. హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా తెరకెక్కిన ఈ వీడియో సాంగ్‌కు విడుదలైన కొద్ది క్షణాల్లోనే అద్భుత స్పందన లభించింది.
► Read latest Cinema News and Telugu News
ఇవీ చదవండి
Tags :