Puneeth Rajkumar: అగ్రనటులందరినీ కాదని.. పునీత్ ఆయన కోసం ఎదురుచూశారట..!
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఆయన మృతిపై ప్రముఖలు, అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బెంగళూరు: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్(puneeth rajkumar) హఠాన్మరణం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఆయన మృతిపై ప్రముఖలు, అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆయనతో ఉన్న జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటున్నారు. హాస్య నటుడు డానిష్ సైత్ ఈ మరణ వార్త విని తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. ‘నా హృదయం ముక్కలైంది. ఇది మాటల్లో చెప్పలేని బాధ. నా గురువు, నా హీరో, గొప్ప వ్యక్తి ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు’ అంటూ పునీత్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోకు చెందిన కొందరు వ్యక్తులు చెప్పిన విషయాన్ని వెల్లడించారు. ‘కొంతకాలం క్రితం అమెజాన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆ సంస్థ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్(jeff bezos), పునీత్ రాజ్‌కుమార్ హాజరయ్యారు. సినీ పరిశ్రమకు చెందిన ఎందరో ప్రముఖులు వచ్చారు. అక్కడి వాతావరణమంతా కోలాహలంగా ఉంది. కొందరు జెఫ్ బెజోస్‌తో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు. పునీత్ మాత్రం ఈ హడావుడికి దూరంగా, ఒక పక్కన నిల్చొని ఉన్నారు. అప్పుడు అమెజాన్ సిబ్బంది ఆయన దగ్గరకు వెళ్లి..‘అప్పూ, మీరెందుకు ఎవరితో ఫొటోలు దిగకుండా ఒక పక్కన ఉన్నారు? మీకు కావాల్సిన వ్యక్తి పేరు చెప్పండి. మేమే వారిని మీ దగ్గరకు తీసుకువస్తాం’ అంటూ అడిగారు. ‘నిజమా? అయితే నేను పంకజ్ త్రిపాఠి(Pankaj Tripathi)ని కలవాలి అనుకుంటున్నాను’ అని నవ్వుతూ సమాధానమిచ్చారట. చుట్టూ ఎంతమంది ఉన్నా మా అప్పూ అన్న ప్రతిభను గుర్తిస్తారు. అలాగే మంచితనాన్ని ఇట్టే పట్టేస్తారు’ అంటూ పునీత్ గొప్పతనాన్ని డానిష్ వివరించారు. ఇప్పుడు పంకజ్ త్రిపాఠి ప్రముఖ నటుడని అందరికీ తెలుసు. కానీ ఈ స్థాయికి వచ్చే క్రమంలో ఆయన ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు.
అలాగే కొత్త టాలెంట్‌ను వెలుగులోకి తీసుకురావడాన్ని పునీత్ తన బాధ్యతగా భావించేవారని డానిష్ చెప్పారు. ఆయన కన్నడ పరిశ్రమలో స్టార్‌గా వెలుగుతున్నప్పటికీ.. ఎంతో సాధారణంగా ఉంటారని, ఆయన్ను కలిసినవారికి ఈ విషయం వెంటనే అర్థమవుతుందన్నారు. పునీత్ రాజ్‌కుమార్ ప్రొడక్షన్లో డానిష్ సైత్ ఫ్రెంచ్ బిర్యానీ సినిమాలో నటించారు. గత ఏడాది జులైలో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
ప్రేమ తన జీవితంలో కీలకపాత్ర పోషిస్తుందని నటి శోభితా ధూళిపాళ్ల అన్నారు. -
సింపుల్‌గా నటుడి కుమార్తె వివాహం
మలయాళ నటుడు జయరాం కుమార్తె వివాహం గుడిలో సింపుల్‌గా జరిగింది. -
యశ్ ‘టాక్సిక్’పై వైరలవుతోన్న న్యూస్.. ఎన్ని భాగాలంటే!
యశ్ నటిస్తోన్న ‘టాక్సిక్’ చిత్రానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
ఇప్పటితో పోలిస్తే తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో పరిస్థితులు భిన్నంగా ఉండేవని నటి సోనాలి బింద్రే అన్నారు. -
ఫొటోషూట్‌లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
తాను సవాలుగా స్వీకరించి నటించిన పాత్రల గురించి రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటంటే? -
అభిమాని బర్త్‌డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
తన అభిమానికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం. -
‘పుష్ప2’ స్టెప్‌పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
‘పుష్ప2’ పాటపై ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కామెంట్ చేశారు. ఆ కామెంట్‌కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. -
సిద్ధార్థ్‌తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
తన తల్లి కోరిక మేరకు నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించినట్లు అదితిరావు హైదరీ చెప్పారు. -
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
ఎన్టీఆర్‌తో తనకున్న బంధంపై రాజమౌళి కామెంట్ చేశారు. -
స్విమ్మింగ్ పూల్‌లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ నుంచి మరో వీడియో వచ్చేసింది. ప్రేమను ఉద్దేశించి పూరి మాట్లాడారు. -
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
రజనీకాంత్ బయోపిక్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అందులో హీరోగా ఎవరు నటిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. -
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె.. ఏ చిత్రానికంటే?
సుకుమార్ కుమార్తెకు ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డు దక్కింది. -
ఎన్టీఆర్‌ను కలిసిన బాలీవుడ్ సీనియర్ నటుడు.. ఇష్టమైన హీరో అంటూ పోస్ట్
ఎన్టీఆర్‌ను బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కలిశారు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
యంగ్‌గా కనిపించడం కోసం అలాంటి పనులు చేయను: ఆమిర్ ఖాన్
మొదటి సారి కపిల్‌శర్మ కార్యక్రమానికి వచ్చిన ఆమిర్ ఖాన్ ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. -
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర
శ్రీసింహా హీరోగా నటించిన ‘ఉస్తాద్’, సత్యం రాజేశ్ ‘పొలిమేర 2’ చిత్రాలకు ‘దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డులు దక్కాయి. -
ముత్యాల దండతో శ్రీలీల.. రాశీఖన్నా ‘బాక్’ స్టిల్.. మీనాక్షి స్మైల్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇదే మా రిలేషన్షిప్ సీక్రెట్: జ్యోతిక
ఇండస్ట్రీకి వచ్చాక తాను కలుసుకున్న తొలి వ్యక్తి సూర్య అని జ్యోతిక తెలిపారు. -
2023 మాకో అద్భుతం.. కంటతడి పెట్టుకున్న బాబీ దేవోల్
2023లో ఎన్నో విజయాలు చూసినట్లు సన్నీదేవోల్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్‌న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్‌పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్