
Published : 30 Sep 2021 01:18 IST
MAA Elections: ‘మా’ ఆశయాలను గెలిపిద్దాం.. ప్రచారం షురూ చేసిన ప్రకాశ్‌రాజ్
ఇంటర్నెట్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల ప్రచార వేడి మొదలైంది. అక్టోబరు 10న జరగనున్న ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల నామినేషన్లు పూర్తయ్యాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రకాశ్‌రాజ్ ప్రచారం షురు చేశారు. సామాజిక మాధ్యమాల వేదికగా తన ప్యానెల్ (సిని‘మా’ బిడ్డలం)కి ఓటేసి గెలిపించాలని కోరారు. ‘‘మా’ హితమే మా అభిమతం. మనస్సాక్షిగా ఓటేద్దాం. ‘మా’ ఆశయాలను గెలిపిద్దాం’ అని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తన ప్యానెల్‌కి సంబంధించిన వివరాల ఫొటోని షేర్ చేశారు.
అధ్యక్షుడు: ప్రకాశ్ రాజ్
కార్యదర్శి: జీవితా రాజశేఖర్
ఉపాధ్యక్షుడు: బెనర్జీ
ఉపాధ్యక్షురాలు: హేమ
ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్: శ్రీకాంత్
సంయుక్త కార్యదర్శి: అనితా చౌదరి
సంయుక్త కార్యదర్శి: ఉత్తేజ్
కోశాధికారి: నాగినీడు
ఇవీ చదవండి
Tags :