Bernard hill: ‘టైటానిక్‌’ కెప్టెన్‌ కన్నుమూత

‘టైటానిక్‌’, ‘ది లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌’లాంటి చిత్రాల్లో మరపురాని పాత్రలు పోషించిన హాలీవుడ్‌ నటుడు బెర్నార్డ్‌ హిల్‌ (79) కన్నుమూశారు.

Updated : 07 May 2024 09:34 IST

‘టైటానిక్‌’, ‘ది లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌’లాంటి చిత్రాల్లో మరపురాని పాత్రలు పోషించిన హాలీవుడ్‌ నటుడు బెర్నార్డ్‌ హిల్‌ (79) కన్నుమూశారు. గాయని బార్బరా డిక్సన్‌ సోమవారం ‘ఎక్స్‌’ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. ‘టైటానిక్‌’లో కెప్టెన్‌ ఎడ్వర్డ్‌ జే స్మిత్‌ పాత్ర ఆయనకు ఎనలేని పేరు తెచ్చిపెట్టింది. నటనపై మమకారంతో థియేటర్‌ ఆర్ట్స్‌ నేర్చుకున్న బెర్నార్డ్‌ తర్వాత టీవీ షోలు, హాలీవుడ్‌ సినిమాలకు పని చేయడం ప్రారంభించారు. ‘వోల్ఫ్‌ హాల్‌’ అనే సినిమాతో వెలుగులోకి వచ్చిన ఆయన యాభైకి పైగా హాలీవుడ్‌ సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. యాక్టర్స్‌ గిల్డ్‌, బాఫ్టాలాంటి అవార్డులకు నామినేట్‌ అయ్యారు. ఆయన నటనని కొనియాడుతూ అభిమానులు, సినీ పరిశ్రమకు చెందినవాళ్లు సామాజిక మాధ్యమాల ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన చివరిసారిగా ‘ఫరెవర్‌ నౌ’ అనే హాలీవుడ్‌ చిత్రంలో నటించారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని