Priyanka Chopra: ఆ మాత్రం కష్టం తప్పనిసరి
అంతర్జాతీయ నటిగా పేరుపొందిన ప్రియాంక చోప్రా వేగంగా చిత్రాలు చేస్తోంది. అమెజాన్ స్టూడియోస్ భాగస్వామిగా ‘అవెంజర్స్-ఎండ్‌గేమ్’ దర్శకుడు ఆంటోని, జోయ్ రుసోతో కలిసి నిర్మిస్తున్న వెబ్‌సిరీస్ ‘సిటాడెల్’. స్పై థ్రిల్లర్...
అంతర్జాతీయ నటిగా పేరుపొందిన ప్రియాంక చోప్రా వేగంగా చిత్రాలు చేస్తోంది. అమెజాన్ స్టూడియోస్ భాగస్వామిగా ‘అవెంజర్స్-ఎండ్‌గేమ్’ దర్శకుడు ఆంటోని, జోయ్ రుసోతో కలిసి నిర్మిస్తున్న వెబ్‌సిరీస్ ‘సిటాడెల్’. స్పై థ్రిల్లర్ జానర్లో రూపొందుతున్న ఈ సిరీస్ భారతదేశంలోనూ విడుదల కానుంది. దీన్ని వేరే నటులతో ‘ఫ్యామిలీమెన్’ దర్శక ద్వయం రాజ్-డీకే రూపొందించనున్నారు. ప్రస్తుతం అమెరికాలో విడుదలయ్యే సిరీస్‌లో ప్రియాంక, రిచర్డ్ మ్యాడెన్ నటిస్తున్నారు. జనవరిలో మొదలైన దీని చిత్రీకరణ పూర్తైంది. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ ‘‘సంవత్సర కాలం చాలా ఉత్సాహంగా, ఉత్తేజంగా గడిచిపోయింది. సిటాడెల్ షూటింగ్ సమయంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకొన్నా. దీనికోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. అయితే అంతిమ ఫలితం చూసుకున్నాక... ఆ మాత్రం కష్టం తప్పనిసరి అనిపించింది.’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె హాలీవుడ్ చిత్రం ‘ది మేట్రిక్స్-రీసరక్షన్’లో నటిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!
-
బైక్ పార్కింగ్ విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న
-
ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈఓ రియాక్షన్ ఇదే..
-
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఎన్టీఆర్‌కు అర్జున్‌పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్