ప్రాణాలు కాపాడిన యాపిల్‌ వాచ్‌.. సీఈఓ రియాక్షన్‌ ఇదే..

యాపిల్‌ వాచ్‌ ఓ మహిళ ప్రాణాల్ని కాపాడింది. అసలు ఒక స్మార్ట్‌ గడియారం ఆమెను ఎలా రక్షించగలిగిందంటే.

Published : 05 May 2024 15:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యాపిల్‌ వాచ్‌ (Apple watch) ఓ మహిళ జీవితాన్ని కాపాడింది. అందులోని పల్స్‌ రేట్‌ ఫీచర్‌ ఆధారంగా అలర్ట్‌ అయిన ఆమె సరైన సమయంలో ఆసుపత్రికి వెళ్లి ప్రాణాలు దక్కించుకుంది. దీనికి సంబంధించిన వివరాలను ఓ ఆంగ్ల మీడియాతో పంచుకున్నారు. దీనిపై యాపిల్‌ సీఈఓ కూడా స్పందించడం విశేషం.

దిల్లీలో పాలసీ పరిశోధకురాలిగా స్నేహ సిన్హా పనిచేస్తున్నారు. ‘‘నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటా. 15,000-16,000 అడుగుల ఎత్తైన పర్వత ప్రాంతాల్లోనూ ట్రెక్కింగ్ చేస్తా. అలాంటి ప్రదేశాల్లో ఆక్సిజన్‌ తక్కువగా ఉంటుంది. అయితే.. ఒక రోజు ఎప్పటిలానే పని ముగించుకొని ఇంటికి వచ్చాను. ఎందుకో గుండెలో దడగా అనిపించింది. నా చేతిలోని యాపిల్‌ వాచ్‌ను చూస్తే హార్ట్‌రేట్‌ ఎక్కువగా చూపిస్తోంది. గట్టిగా శ్వాస తీసుకోవడానికి ప్రయత్నించాను. కొద్దిసేపటికి సర్దుకుంటుందిలే అనుకున్నా. పెద్దగా పట్టించుకోలేదు. అయితే 1.5 గంటలు దాటినా హార్ట్‌రేట్‌ ఎక్కువగా చూపిస్తోంది. అసాధారణ హృదయ స్పందన అంటూ హెచ్చరించింది. వైద్య సహాయం తీసుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నా. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లమని స్నేహితుడికి ఫోన్‌ చేశా. అక్కడకు చేరే వరకూ వాచ్‌లోని పల్స్‌ రేటును గమనిస్తూనే ఉన్నా. సరైన సమయానికి ఆసుపత్రికి వెళ్లి ప్రాణాలు దక్కించుకున్నా’’ అని స్నేహ సిన్హా తెలిపారు.

ఆరోగ్య బీమా మరింత భారం

స్మార్ట్‌వాచ్‌లోని హార్ట్‌ మానిటరింగ్‌ ఫీచర్‌ ప్రాణాలను రక్షించిందన్నారు. ఈ ఘటనను యాపిల్‌ సంస్థ సీఈఓ టిమ్‌ కుక్‌ (Tim Cook)తో ఇ-మెయిల్‌ ద్వారా పంచుకున్నారు. దీనిపై ఆయన స్పందించారు. సరైన సమయానికి వైద్యం అందినందుకు సంతోషంగా ఉందని సమాధానం పంపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని