Rashmi Rocket: ‘రష్మి రాకెట్‌’ ట్రైలర్‌ వచ్చేసింది.. తాప్సీ అదరగొట్టేసింది..!

మహిళా ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బీటౌన్‌ బ్యూటీ తాప్సీ. కథానాయిక అంటే కేవలం గ్లామర్‌ రోల్స్‌ మాత్రమే కాదని నిరూపిస్తూ తరచూ విభిన్న...

Published : 24 Sep 2021 12:46 IST

ముంబయి: మహిళా ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బీటౌన్‌ బ్యూటీ తాప్సీ. కథానాయిక అంటే కేవలం గ్లామర్‌ రోల్స్‌ మాత్రమే కాదని నిరూపిస్తూ తరచూ విభిన్న కథలతో ప్రేక్షకుల్ని మెప్పిస్తోంది. ఆమె నటించిన సరికొత్త చిత్రం ‘రష్మీ రాకెట్‌’. గుజరాత్‌కు చెందిన అథ్లెట్‌ రష్మీ పాత్రను తాప్సీ పోషించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. మహిళలను చులకనగా చూసే సమాజం నుంచి వచ్చి క్రీడల్లో తన సత్తా చాటిన అమ్మాయి పాత్రలో తాప్సీ నటన అదరగొట్టేలా ఉంది. క్రీడల్లో రాణిస్తున్న తరుణంలో లింగనిర్ధారణ పరీక్షల కారణంగా ఆమె జీవితం ఏవిధంగా మారింది? ఆ తర్వాత ఆమె ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? న్యాయస్థానం ఎదుట ఆమె ఎలా గెలిచింది? అనే విషయాలను తెలియజేస్తూ ఈ చిత్రం తెరకెక్కినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. ఆకర్ష్‌ ఖురానా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రోనీ స్ర్కూవాలా, నేహా, ప్రంజల్‌ సంయుక్తంగా నిర్మించారు. వచ్చే నెల 15న జీ5 ఓటీటీ వేదికగా ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని