RRR: ఐటమ్ సాంగ్ ఉంటే నువ్వు చేస్తావా?
రామ్‌చరణ్, తారక్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7, 2022లో ఈసినిమ....
హైదరాబాద్: రామ్‌చరణ్, తారక్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7, 2022లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ‘ఆర్ఆర్ఆర్’లోని పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం ‘జనని’ అనే దేశభక్తిని చాటే పాటను ప్రేక్షకులతో పంచుకుంది. ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోన్న ఈ పాటకు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్నారు. ఈ పాటని చూస్తుంటే కళ్లు చెమ్మగిల్లుతున్నాయంటూ ట్వీట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఓ నెటిజన్.. ‘‘సినిమాలో ఐటమ్ సాంగ్ ఏదైనా ఉందా మామా?’’ అని కామెంట్ చేశాడు. దానిపై స్పందించిన టీమ్ సరదాగానే నెటిజన్‌కు చురకలు పెట్టింది. ‘‘ఏ ఒకవేళ ఐటమ్ సాంగ్ ఉంటే నువ్వు చేస్తావా?’’ అని అడిగింది. ఇప్పుడు ఈ ట్వీట్ కాస్త నెట్టింట్లో నెగ చక్కర్లు కొడుతోంది. ‘‘ఆర్ఆర్ఆర్’ మావ.. రోజురోజుకీ అప్డేట్ అవుతున్నాడు. మీమ్స్, కౌంటర్లతో అదరగొట్టేస్తున్నాడు’’ అని నెటిజన్లు చెప్పుకుంటున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈసినిమాలో హాలీవుడ్, బాలీవుడ్ నటీనటులు కీలకపాత్రలు పోషించారు. ఆలియాభట్, ఒలీవియా మోరీస్, అజయ్‌దేవ్‌గణ్, శ్రియ, సముద్రఖని, రేయ్ స్టీవ్‌సన్, ఎలిసన్ డ్యూడీ ముఖ్య భూమికల్లో కనిపించనున్నారు. కీరవాణి స్వరాలు సమకూర్చారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య ఈచిత్రాన్ని నిర్మించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్‌తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.