Rambo: ఈ ఏడాదిలోనే ‘రాంబో’ మొదలు

‘‘రాంబో’ చిత్రం నా కెరీర్‌లోనే ఉత్తమమైనదిగా రూపొందించడానికి అన్ని ఏర్పాట్లు  జరుగుతున్నాయి’’ అన్నాడు టైగర్‌ ష్రాఫ్‌.  ఇటీవలే తను నటించిన ‘హీరోపంతి-2’ చిత్రం విడుదలైంది.

Updated : 07 May 2022 11:09 IST

‘‘రాంబో’ చిత్రం నా కెరీర్‌లోనే ఉత్తమమైనదిగా రూపొందించడానికి అన్ని ఏర్పాట్లు  జరుగుతున్నాయి’’ అన్నాడు టైగర్‌ ష్రాఫ్‌.  ఇటీవలే తను నటించిన ‘హీరోపంతి-2’ చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా టైగర్‌ మీడియాతో మాట్లాడుతూ తన భవిష్యత్తు ప్రాజెక్టు గురించి చెప్పాడు. ‘‘రాంబో’ కోసం నేను ఎంతగానో ఎదురుచూస్తున్నా. దర్శకుడు రోహిత్‌ ధావన్‌ దీనికోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడు’’ అని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా 2022 చివర్లో సెట్స్‌పైకి వెళ్లనుంది. సిల్వస్టెర్‌ స్టెలోన్‌ కథానాయకుడిగా 1982లో విడుదలైన హాలీవుడ్‌ చిత్రం ‘రాంబో’ స్ఫూర్తితో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టైగర్‌ అక్షయ్‌కుమార్‌తో కలిసి ‘బడేమియా చోటే మియా’, ‘గణపథ్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని