ఇందువదన: వడివడిగా సుడిగాలిగా..

వరుణ్‌ సందేశ్‌ సందడి షురూ చేశాడు. ‘ఇందువదన’ అంటూ సరికొత్త ప్రేమకథతో అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఎమ్‌ఎస్‌ఆర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్‌ సరసన ఫర్నాజ్‌ శెట్టి సందడి చేయనుంది. ఇటీవల విడుదల చేసి ఫస్ట్‌లుక్‌ అందరి దృష్టిని ఆకర్షించింది.

Updated : 07 Dec 2022 16:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వరుణ్‌ సందేశ్‌ సందడి షురూ చేశాడు. ‘ఇందువద మకథతో అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఎమ్‌ఎస్‌ఆర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్‌ సరసన ఫర్నాజ్‌ శెట్టి సందడి చేయనుంది. ఇటీవల విడుదల చేసి ఫస్ట్‌లుక్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. చిత్రబృందం తాజాగా నుంచి ఒక పాట విడుదల చేసింది. ‘వడివడిగా సుడిగాలిగా వచ్చి’ అంటూ సాగే పాట యువతను ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రంలో రఘుబాబు, ఆలీ, నాగినీడు, సురేశ్‌వాణి, తాగుబోతు రమేశ్‌, ధన్‌రాజ్‌, మహేశ్‌విట్ట కీలకపాత్రలు పోషిస్తున్నారు. శ్రీబాలాజీ పిక్చర్స్‌ పతాకంపై మాధవి ఆదుర్తి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. తాజాగా విడుదలైన ఈ పాటకు తిరుపతి జావన లిరిక్స్‌ అందించగా జావిద్‌ అలీ, మాళవిక ఆలపించారు. శివకాకాని సంగీతం అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని