
Vidyut Jammwal: ఆరుగురు కలసి రెండే వేళ్లతో ఒక మనిషిని ఎత్తగలరా?
ఇంటర్నెట్ డెస్క్: డూప్ లేకుండా స్టంట్స్ చేయడంలో బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ రూటే సపరేటు. చాలామందికి సాధ్యం కాని పనులను అలవోకగా చేసేస్తుంటాడు. అలాంటి విద్యుత్ జమ్వాల్ రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఆ వీడియో గురించి తెలుసుకునేలోపు... ఓ మాట అనుకుందాం. ఆరుగురు కలసి ఒక వ్యక్తిని పైకి లేపడం సాధ్యమా? ఏముంది చాలా సులభం అనొచ్చు. అయితే కేవలం రెండు వేళ్లే ఉపయోగించి పైకి ఎత్తడం సాధ్యమా? ఇప్పుడు డౌటే కదా. ఇలాంటి డౌట్ఫుల్ ఫీట్నే చేసి చూపించారు విద్యుత్ జమ్వాల్.
అయితే దీని కోసం చిన్నపాటి జాగ్రత్తలు, వేళ్ల మధ్య సమ దూరం పాటిస్తే సులభంగా ఎత్తేయొచ్చు అని వీడియోలో చేసి నిరూపించారు విద్యుత్ టీమ్. ఒక వ్యక్తిని నేలపై వెల్లకిలా పడుకోబెట్టి... రెండు వైపులా ముగ్గురేసి ఉండి.. రెండు వేళ్లతో పైకి లేపారు. కావాలంటే దిగువ వీడియోలో మీరూ ఆ ఫీట్ చూడొచ్చు. ఇదంతా కళరిపయట్టు యుద్ధ విద్యకు సంబంధించిన ఫీట్ అని సమాచారం.
ప్రస్తుతం విద్యుత్ జమ్వాల్ ‘ఐబీ 71’అనే సినిమాలో నటిస్తున్నాడు. టాలీవుడ్ దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విద్యుత్ భారత ఇంటెలిజెన్స్ అధికారిగా కనిపిస్తాడని సమాచారం. ఈ సినిమాకు విద్యుత్ నిర్మాత కూడా. టీ సిరీస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్తో కలసి ఈ సినిమా నిర్మిస్తున్నాడు.