vijay: వెట్రిమారన్‌ దర్శకత్వంలో విజయ్‌?

తమిళ కథానాయకుడు విజయ్‌ ఇటీవలే రాజకీయ పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి అడుగు పెట్టేముందు చేతిలో ఉన్న సినిమాతో పాటు మరో చిత్రాన్ని చేస్తానని ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్‌ను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించనున్నట్లు తెలిసింది.

Updated : 07 Feb 2024 09:31 IST

మిళ కథానాయకుడు విజయ్‌ ఇటీవలే రాజకీయ పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి అడుగు పెట్టేముందు చేతిలో ఉన్న సినిమాతో పాటు మరో చిత్రాన్ని చేస్తానని ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్‌ను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించనున్నట్లు తెలిసింది. ఈ విషయమై రెండేళ్ల క్రితమే ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరిందట. ఇప్పుడీ సినిమాకి వెట్రిమారన్‌ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం అందుతోంది. సామాజిక అంశాలతో నిండిన కథాంశాల్ని ప్రేక్షకుల మనసుకు హత్తుకునేలా బలంగా చెప్పడంలో వెట్రిమారన్‌ది అందె వేసిన చేయి. ప్రస్తుతం ఆయన విజయ్‌ రాజకీయ ప్రవేశాన్ని దృష్టిలో పెట్టుకొని తనదైన శైలిలో ఓ బలమైన కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్‌ చేస్తున్న ‘గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్స్‌’ సినిమా పూర్తికాగానే ఈ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు ప్రణాళిక రచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని