Vijay 66: సంక్రాంతి బరి.. విజయ్‌ మరి

వచ్చే సంక్రాంతి లక్ష్యంగా పలు సినిమాలు ముస్తాబవుతున్నాయి. అందులో విజయ్‌ కథానాయకుడిగా.. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఒకటి.

Updated : 09 May 2022 14:07 IST

వచ్చే సంక్రాంతి లక్ష్యంగా పలు సినిమాలు ముస్తాబవుతున్నాయి. అందులో విజయ్‌ కథానాయకుడిగా.. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఒకటి. ఇందులో విజయ్‌కి జోడీగా రష్మిక మందన్న నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో సీనియర్‌ నటులు ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, ప్రభు, శరత్‌కుమార్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారని ఆదివారం సినీ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఆ ప్రకటనలో 2023 సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు స్పష్టం చేశాయి. ఇప్పటికే ఒక షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తైంది. మరో సుదీర్ఘ షెడ్యూల్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. దీనికి తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని