Committee kurrollu: రోడ్లన్నీ గతుకులపాలే.. ఊరంతా చీకటిపాలే
ఓట్లు కొనేసి ఆ తర్వాత ప్రజల బాగుని మరిచే రాజకీయ నాయకుల్ని నమ్మొద్దని... గొర్రెల్లా కాకుండా మనిషిలా ఆలోచించి ఓటు వేయండని పిలుపునిస్తూ ‘కమిటీ కుర్రోళ్ళు’ పాటందుకున్నారు. మరి వారి ఆట పాట జనాల్లో ఎలాంటి మార్పుని తీసుకొచ్చిందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఓట్లు కొనేసి ఆ తర్వాత ప్రజల బాగుని మరిచే రాజకీయ నాయకుల్ని నమ్మొద్దని... గొర్రెల్లా కాకుండా మనిషిలా ఆలోచించి ఓటు వేయండని పిలుపునిస్తూ ‘కమిటీ కుర్రోళ్ళు’ పాటందుకున్నారు. మరి వారి ఆట పాట జనాల్లో ఎలాంటి మార్పుని తీసుకొచ్చిందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రధారులుగా... యదు వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. నిహారిక కొణిదెల సమర్పణలో... పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మిస్తున్నారు. ‘గొర్రెలా...’ అంటూ సాగే ఈ సినిమాలోని పాటని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ విడుదల చేశారు. ‘రోడ్లన్నీ గతుకులపాలే ఊరంతా చీకటిపాలే... రేషన్లు, పింఛన్లన్నీ మొత్తానికి గల్లంతాయే...’ అంటూ సాగే ఈ పాటని అనుదీప్ దేవ్ సంగీత సారథ్యంలో నాగ్ అర్జున్‌రెడ్డి రాశారు. అనుదీప్ దేవ్, వినాయక్, అఖిల్ చంద్ర, హర్షవర్ధన్ చావలి, ఆదిత్య భీమతాటి, సింధూజ శ్రీనివాసన్, మనీషా పండ్రాంకి, అర్జున్ విజయ్ పాడారు. పాట విడుదల అనంతరం జయప్రకాశ్ నారాయణ మాట్లాడుతూ ‘‘దేశ భవిష్యత్తుని కాపాడాలంటే యువతలో సరైన ఆలోచన ఉండాలి. ఓటు వేయడంలో మార్పు రావాలి. నిరాశని వదిలి ఆత్మవిశ్వాసంతో ముందుకు కదలాలి. అందరిలోనూ ఆలోచన రేకెత్తించేలా ‘కమిటీ కుర్రోళ్ళు’ బృందం మంచి పాటని తీసుకొచ్చింద’’ని అభినందించారు. చిత్ర సమర్పకులు నిహారిక కొణిదెల మాట్లాడుతూ ‘‘జయప్రకాశ్ నారాయణ సర్ ప్రసంగం వినే మా దర్శకుడు ఈ సినిమాని మొదలు పెట్టారు. ఆయన చేతులమీదుగానే ఈ పాట విడుదల కావడం ఆనందంగా ఉంది. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అగ్గంటుకుంది సంద్రం’.. ‘దేవర’ సాంగ్ వచ్చేసింది
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘దేవర’. ఇందులోని తొలి గీతం తాజాగా విడుదలైంది.
-
హిందీ ‘గజనీ’.. మురుగదాస్ ఫస్ట్ ఛాయిస్ సల్మాన్
ఆమిర్ నటించిన ‘గజనీ’మూవీకి సంబంధించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు నటుడు ప్రదీప్ రావత్ -
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్‌గేల్‌తో రిషబ్ ఫొటో
ధోనీపై కమల్ హాసన్ ప్రశంసలు కురిపించారు. క్రిస్‌గేల్‌తో కలిసి దిగిన ఫొటోను రిషబ్ షేర్ చేశారు. -
18 ఏళ్ల ‘గోదావరి’.. సుమంత్‌కు ముందు అనుకున్న హీరోలెవరంటే?
సుమంత్ హీరోగా నటించిన ‘గోదావరి’కి 18 ఏళ్లు. ఈ సినిమా గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం.. -
కథ కలిపింది..ఇద్దరినీ!
హిట్టు మాట వినిపించి... స్టార్ ఇమేజ్ దక్కించుకున్నారంటే చాలు.. ఇక ఆ తర్వాత సదరు నాయికల ప్రయాణమంతా అందుకు తగ్గట్లుగా సాగాల్సిందే. -
కల్కి.. పాట వచ్చేస్తోంది
‘కల్కి 2898ఎ.డి’తో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు ప్రభాస్. -
‘నా ఉచ్ఛ్వాసం కవనం’..
తెలుగు సినిమా పాటకు కావ్య గౌరవాన్ని తీసుకువచ్చి, సరికొత్త పోకడ సృష్టించిన గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. -
సిద్ధార్థ్.. కృతి.. ఓ ప్రేమకథ?
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ చిత్రంలో ఎయిర్‌హోస్టెస్‌గా కనిపించి సినీప్రియుల మనసు దోచుకుంది బాలీవుడ్ నాయిక కృతి సనన్. -
సరికొత్త రొమాంటిక్ లవ్‌స్టోరీ
వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి నాయకానాయికలుగా నటించిన చిత్రం ‘సిల్క్ శారీ’. -
ఛోటా భీమ్ సూపర్ పవర్
‘ధైర్య సాహసాలతో తన ప్రాణాలు పణంగా పెట్టి ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు ఒకడుంటాడు. -
పెట్స్‌పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
‘హరోం హర’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానున్నారు సుధీర్ బాబు. ప్రస్తుతం ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ అసంతృప్తి
-
తెలంగాణ మంత్రివర్గ భేటీకి ముహూర్తం ఖరారు
-
తెలంగాణలో పలు చోట్ల వర్షం.. పిడుగుపాటుకు ముగ్గురి మృతి
-
నరసరావుపేటలో రెండో రోజు సిట్ దర్యాప్తు.. పోలీస్ స్టేషన్‌కు మంత్రి అంబటి
-
హిందీ ‘గజనీ’.. మురుగదాస్ ఫస్ట్ ఛాయిస్ సల్మాన్
-
అత్యంత పొట్టి మహిళతో ది గ్రేట్ ఖలీ.. వీడియో వైరల్