Tollywood: జులై 20న.. కౌలాలంపూర్‌లో

తెలుగు సినిమా వైభవాన్ని... వారసత్వ పరంపరని చాటి చెప్పేలా 90 ఏళ్ల వేడుకని నిర్వహిస్తామని చెప్పారు మా అధ్యక్షుడు మంచు విష్ణు. జులై 20న కౌలాలంపూర్‌, బుకిట్‌ జలీల్‌లోని ప్రతిష్ఠాత్మక నేషనల్‌ స్టేడియంలో ఈ వేడుకల్ని నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు.

Updated : 08 May 2024 09:42 IST

తెలుగు సినిమా వైభవాన్ని... వారసత్వ పరంపరని చాటి చెప్పేలా 90 ఏళ్ల వేడుకని నిర్వహిస్తామని చెప్పారు మా అధ్యక్షుడు మంచు విష్ణు. జులై 20న కౌలాలంపూర్‌, బుకిట్‌ జలీల్‌లోని ప్రతిష్ఠాత్మక నేషనల్‌ స్టేడియంలో ఈ వేడుకల్ని నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ వేడుకకి సంబంధించిన ఏర్పాట్లలో భాగంగా ఇటీవల మలేషియాలో ఓ సమావేశాన్ని నిర్వహించినట్టు తెలిపారు విష్ణు. ‘‘మూవీ ఆర్టిస్‌ అసోసియేషన్‌తోపాటు, మలేషియా టూరిజం, ఎమ్‌.సి ఎంటర్‌టైన్‌మెంట్‌ భాగస్వామ్యంతో ఈ వేడుకలు జరుగుతాయి. సాంస్కృతిక మార్పిడికి చిహ్నంగా...  మలేషియా ప్రజలు, తెలుగు మాట్లాడే వర్గాల మధ్య పరస్పర అవగహన, గౌరవాన్ని పెంపొందించేలా ఈ వేడుకల్ని నిర్వహిస్తామ’’ని ఓ ప్రకటనలో తెలిపారు మంచు విష్ణు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని