
Updated : 29 Dec 2020 19:59 IST
అట్లాంటాలో తెలుగువారి క్రిస్మస్ వేడుకలు..
అట్లాంటా: అమెరికాలోని జార్జియా రాష్ట్రం అట్లాంటా చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. అనేకమంది తెలుగువారు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని ఆనందంగా వేడుకలను జరుపుకొన్నారు. అమెరికాలో కరోనా విలయ తాండవం చేస్తున్న వేళ కొవిడ్ నిబంధనలు అమలులో ఉండటంతో అనేకమంది జూమ్, ఫేస్బుక్ ద్వారా పాల్గొని ఏసుక్రీస్తును ప్రార్థించి దీవెనలు అందుకున్నారు. జాన్ బిల్లా, సుధా దాసరితో పాటు పలువురు ఈ చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ జాన్ బిల్లా అందరినీ ఉద్దేశించి సందేశాన్ని ఇచ్చారు. అమెరికాలోని అట్లాంటాలో గత ఎనిమిదేళ్లుగా పాస్టర్ జాన్ బిల్లా, సుధా ఈ చర్చిలో ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.
Tags :