Updated : 06/02/2020 19:31 IST

కువైట్‌లో టెన్నిస్ విజేతగా తెలుగమ్మాయి

కువైట్‌: కువైట్‌లోని రఫా నాదల్‌ అకాడమీ నిర్వహించిన అండర్‌-16 బాలికల టెన్నిస్‌ పోటీల్లో తెలుగు అమ్మాయి సాయి హర్షిత అడివి విజేతగా నిలిచింది. బుధవారం సాయంత్రం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో టెన్నిస్‌ దిగ్గజం రఫెల్‌ నాదల్‌ పాల్గొని ఆమెకు ట్రోఫీ అందజేశారు. బహుమతుల ప్రదానోత్సవానికి కువైట్‌లోని పలువురు అధికారులు హాజరయ్యారు. కాగా, రఫా అకాడమీ ప్రస్తుతం షేక్‌ జబర్‌ అల్‌ అబ్దుల్లా అల్‌ జబర్‌ అల్‌ సబాహ్‌ ఇంటర్నెషనల్‌ టెన్నిస్‌ కాంప్లెక్స్‌తో కలిసి పనిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంకు చెందిన బాలశివ శ్రీకాంత్‌ అడివి, మోహిని విమల కిరణ్‌ల కుమార్తె హర్షిత. శ్రీకాంత్‌ స్థానిక ఆయిల్‌ కంపెనీలో టీపీఎల్‌ స్పెషలిస్టుగా పనిచేస్తుండగా ఆయన కుమార్తె తొమ్మిదో తరగతి చదువుతోంది.

హర్షిత కువైట్‌లోని దిల్లీ పబ్లిక్‌ స్కూల్లో చదువుతోంది. స్కూల్లో టాపర్‌గా కొనసాగుతూ నాలుగేళ్లుగా ‘స్కాలర్‌ బ్యాడ్జ్‌’ను అందుకుంటోంది. చదువుతో పాటు ఇతర రంగాల్లోనూ హర్షిత తన ప్రతిభను చాటుతోంది. అలాగే 2019 ఏప్రిల్‌లో భరత నాట్యం ప్రదర్శన చేసి అందరితో ప్రశంసలందుకుంది. దాంతో పాటు కథక్‌ కూడా నేర్చుకొని ఔరా అనిపిస్తోంది.

 

 


Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని