Published : 13/12/2020 19:01 IST

అంతర్జాల వేదికగా అదరగొట్టిన ‘మాయాబజార్’

సింగపూర్‌: ఆదరణ కరవైపోతున్న అలనాటి సురభి రంగస్థల నాటక వైభవ పునరుద్ధరణ కోసం ‘శ్రీ సాంస్కృతిక కళాసారధి’ సింగపూర్, ‘తెలుగుమల్లి’ ఆస్ట్రేలియా తెలుగు సాంస్కృతిక సంస్థలు ముందుకొచ్చి ఒక చక్కని అంతర్జాల వేదికను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ‘సింగపూర్ తెలుగు టీవీ’ సౌజన్యంతో, అంతర్జాల వేదికపై ‘జయానంద్ సురభి నాటక బృందం’ ‘మాయాబజార్’ నాటిక సరికొత్త సాంకేతిక పంథాలో ఆవిష్కరించింది.

ఈ కార్యక్రమానికి ప్రముఖ రంగస్థల నటులు గుమ్మడి గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఆదరణ కరవైపోతున్న రంగస్థల నాటకాలను, కళాకారులను ఆదుకొని ప్రోత్సహిస్తున్న ఆస్ట్రేలియా, సింగపూర్ తెలుగు సంస్థలను ఈ సందర్భంగా అభినందించారు. అన్ని దేశాల వారూ కరోనా కష్టకాలంలో కళాకారులను ఆదుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సుమారు 60 మంది కళాకారులతో రెండు గంటలపాటు ప్రదర్శించిన ఈ నాటకం అమితంగా అలరించింది. యూట్యూబ్, ఫేస్‌బుక్‌ వేదికగా ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఆస్ట్రేలియా న్యూజిలాండ్, సింగపూర్, భారత్ దేశాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా 4000కు పైగా తెలుగు నాటకరంగ ప్రియులు వీక్షించారు.

ఈ కార్యక్రమానికి సింగపూర్ నుంచి గణేశ్న రాధాకృష్ణ ప్రధాన సాంకేతిక నిర్వాహకునిగా వ్యవహరించి ప్రత్యక్ష ప్రసారానికి అద్భుతమైన సేవలందించారు. కార్యక్రమం ముఖ్య నిర్వాహకులైన ‘తెలుగుమల్లి’ ఆస్ట్రేలియా అధ్యక్షులు కొంచాడ మల్లికేశ్వర రావు, ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ సింగపూర్ అధ్యక్షులు కవుటూరు  రత్నకుమార్‌లు మాట్లాడుతూ ‘కళాకారులను ఆర్థికంగా ఆదుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, రెండు దేశాల నుంచి సుమారు లక్ష రూపాయల నగదు సహాయం కళాకారులకు అందిస్తున్నామని తెలియజేశారు.


Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని