Updated : 18/02/2021 13:18 IST

శ్వేతసౌధం.. ఓ స్వర్ణపంజరం

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సరదా వ్యాఖ్యలు

వాషింగ్టన్‌: శ్వేతసౌధంలో జీవనం ‘బంగారు పూత పూసిన పంజరం’లా ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సరదాగా అభివర్ణించారు. గత అధ్యక్షులు చెప్పిన మాటలను ఉటంకిస్తూ ఆయన ఈ వ్యాఖ్య చేశారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టి 4 వారాలవుతున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే తాను శ్వేతసౌధ జీవనానికి అలవాటు పడుతున్నట్లు చెప్పారు. ఇక్కడి జీవనంపై ఆయన ‘సీఎన్‌ఎన్‌ టౌన్‌హాల్‌’ కార్యక్రమంలో మంగళవారం రాత్రి మాట్లాడారు. శ్వేతసౌధంలో జీవితం ఇంకా తనకు ఆశ్చర్యంగానే ఉంటుందన్నారు. ఉదయం లేవగానే తాను జిల్‌ (తన సతీమణి)ను ‘మనం ఎక్కడ ఉన్నాం?’ అని అడుగుతుంటానని నవ్వుతూ చెప్పారు. బయట నడవడానికి, పనులు చేయడానికి ఇది బంగారుపూత పూసిన పంజరంలా అనిపిస్తుంటుందన్నారు. ‘‘నేను చాలా ఆత్మచేతనలో ఉంటాను. నా పనులు నేనే చేసుకోవాలని అనుకుంటాను. శ్వేతసౌధపు సిబ్బంది నా కోసం ఎదురు చూడాలని కోరుకోను’’ అని బైడెన్‌ వివరించారు.

గతంలో ఆయన అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టిన సంగతి తెలిసిందే. ఈమేరకు ఉపాధ్యక్ష భవనంతో పోలిస్తే.. అధ్యక్ష భవననం పూర్తి విభిన్నమైనదని చెప్పారు. 80 ఎకరాల్లో విస్తరించిన శ్వేతసౌధం విశాల ప్రాంగణం గురించి వివరించారు. ఈత కొలను వంటివాటి గురించి చెప్పారు. ఇక తాను ఓవల్‌ ఆఫీస్‌ (అధ్యక్ష కార్యాలయం)కు ఎన్నోసార్లు వెళ్లినప్పటికీ.. శ్వేతసౌధం నివాస ప్రాంతాల్లోకి గతంలో ఎప్పుడూ వెళ్లలేదని చెప్పారు. ఇప్పటికీ నివాస భవనం కొత్తగానే అనిపిస్తోందంటే అధ్యక్ష బాధ్యతల్లో తాను పూర్తిగా మునిగిపోయినట్లే అర్థమని చెప్పారు. ‘‘ఒక్కోసారి పరిస్థితులు వేగంగా కదులుతుంటాయి.. అది భారం వల్ల కాదు, అనేక పరిణామాల వల్ల.. నిరంతరం ఏదో ఒక సమస్య లేదా అవకాశం మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇది నాలుగేళ్లు ఉంటుంది’’ అని అన్నారు. తాను గత అధ్యక్షులకు ఫోన్‌చేసి మాట్లాడుతుంటానని ఈ సందర్భంగా చెప్పారు. అయితే వారెవరో మాత్రం చెప్పలేదు. వారూ తనతో మాట్లాడుతుంటారని తెలిపారు. అధ్యక్ష బాధ్యతల గురించి వివరిస్తూ.. శ్వేతసౌధంలో నివసించాలన్నది తన కోరిక కాదని.. దేశ భవిష్యత్తు కోసం నిర్ణయాలు తీసుకునే అధికారం కావాలన్నదే తన ఆశయమని చెప్పారు.

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని