కరోనాపై కేంద్రం మరోసారి అఖిలపక్ష భేటీ!

దేశంలో కరోనా పరిస్థితిపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన డిసెంబర్‌ 4న (శుక్రవారం) ఈ భేటీ జరగనుంది........

Published : 30 Nov 2020 14:56 IST

దిల్లీ: దేశంలో కరోనా పరిస్థితిపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన డిసెంబర్‌ 4న (శుక్రవారం) ఈ భేటీ జరగనుంది. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు జరగబోయే ఈ సమావేశానికి పార్లమెంట్‌ ఉభయ సభల్లోని ఆయా పార్టీలకు చెందిన పార్లమెంటరీ పక్ష నేతలు వర్చువల్‌ పద్ధతిలో పాల్గొననున్నారు. ఈ సమావేశాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సమన్వయం చేయనుంది. 

దేశంలో కరోనాతో ఏర్పడిన సంక్షోభం తర్వాత ఇది రెండో అఖిలపక్ష సమావేశం కానుంది. ఈ సమావేశంలో కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, హోంమంత్రి అమిత్‌ షా, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్‌తో పాటు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ, సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ హాజరు కానున్నారు. 

దేశ రాజధాని దిల్లీ నగరంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలను బడ్జెట్‌ సమావేశాలతో కలిపి నిర్వహించాలని కేంద్రం యోచిస్తున్న తరుణంలో ఈ అఖిలపక్ష భేటీ జరగనుంది.  మరోవైపు, దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. తాజాగా 38,772 కేసులు, 443 మరణాలు నమోదైన విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని