
Buddha Venkanna: తెదేపా నేత బుద్దా వెంకన్న బెయిల్‌పై విడుదల
విజయవాడ: ఏపీ మంత్రి కొడాలి నాని, డీజీపీ సవాంగ్‌పై వ్యాఖ్యల నేపథ్యంలో అరెస్టైన తెదేపా నేత బుద్దా వెంకన్న బెయిల్‌పై విడుదల అయ్యారు. పోలీసులు ఆయనకు 41ఎ నోటీసులు ఇచ్చి స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో బుద్దావెంకన్న ఏపీ మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో పోలీసులు అయనను అరెస్ట్ చేసి విజయవాడ వన్‌టౌన్ పోలీస్టేషన్‌కు తరలించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.