Balakrishna: పాత్రికేయులపై దాడి హేయమైన చర్య: నందమూరి బాలకృష్ణ

జగన్‌ సిద్ధం సభలో పాత్రికేయులపై వైకాపా కార్యకర్తల దాడిని నటుడు, తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఖండించారు.

Published : 19 Feb 2024 17:15 IST

విజయవాడ: ఏపీ సీఎం జగన్‌ ‘సిద్ధం’ సభలో పాత్రికేయులపై వైకాపా కార్యకర్తల దాడిని నటుడు, తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (nandamuri balakrishna) ఖండించారు. విధినిర్వహణలో ఉన్న పాత్రికేయులపై దాడి హేయమైన చర్య అన్నారు. ప్రశ్నించే గొంతులను అణచివేయాలనుకోవడం సరికాదని హితవు పలికారు. రాష్ట్రంలో పాత్రికేయులపై దాడులు పెరిగాయని, వారి రక్షణ కోసం కఠిన చట్టాలు తేవాల్సిన అవసరం ఉందన్నారు. వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దింపే రోజు ఎంతో దూరం లేదని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు