TMC: మమతను వేధించడానికే గవర్నర్‌ను నియమించారు..!

తన రాష్ట్ర గవర్నర్‌ ట్విటర్ ఖాతాను బ్లాక్‌ చేసినట్లు చెప్పి పశ్చిమ్ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆశ్చర్యపర్చారు.

Published : 02 Feb 2022 01:17 IST

కోల్‌కతా: తన రాష్ట్ర గవర్నర్‌ ట్విటర్ ఖాతాను బ్లాక్‌ చేసినట్లు చెప్పి పశ్చిమ్ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆశ్చర్యపర్చారు. ఇప్పుడు మమత పార్టీ (టీఎంసీ) పత్రిక జాగో బంగ్లా కూడా ఇదే తరహాలో స్పందించింది. తమ అధినేత్రిని వేధించడానికే భాజపా గవర్నర్‌ను నియమించిందని నిందించింది. ‘గవర్నర్‌ను నియమించే సమయంలో భాజపాకు ఉన్న ఏకైక లక్ష్యం.. ఎలాగైనా మమతా బెనర్జీని వేధించడమే. ఈ వేధింపులు, కేంద్రం నుంచి భాజపా నేతల ప్రవాహం ఉన్నా సరే.. మమత మూడోసారి విజయం సాధించారు’ అంటూ భాజపాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఇదిలా ఉండగా.. గవర్నర్ ఖాతాను మమత బ్లాక్‌ చేయడంపై కమలం పార్టీ స్పందించింది. ‘ఆమె గవర్నర్ ఖాతాను బ్లాక్ చేస్తే ఏం జరుగుతుంది? ఆయన వెళ్లిపోతారా? ఆయన తన పని తాను చేసుకుంటారు. కానీ భవిష్యత్తు తరాలకు ఇది ఒక చెడు సూచికగా మిగులుతుంది’ అని విమర్శించింది. టీఎంసీ అధినేత్రి నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ ఖాతా బ్లాక్‌ చేసిన విషయాన్ని వెల్లడించారు. అందుకు క్షమాపణలు చెప్పారు. ఆయన పెట్టే ట్వీట్లతో చిరాకు వస్తోందని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఆయన విషయమై ప్రధానికి పలుమార్లు లేఖ రాసినట్లు కూడా చెప్పారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని