Bandi Sanjay: డ్వాక్రా గ్రూపులను తెరాస నిర్వీర్యం చేసింది: బండి సంజయ్‌

గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్‌), పట్టణపేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా), మహిళ స్వయం సహాయక సంఘం(ఎస్‌హెచ్‌జీ)లకు ప్రభుత్వం చెల్లించాల్సిన

Updated : 12 Aug 2022 14:04 IST

హైదరాబాద్: గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్‌), పట్టణపేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా), మహిళా స్వయం సహాయక సంఘాలకు(ఎస్‌హెచ్‌జీ) ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ బకాయిలు రూ.4 వేల కోట్ల వరకు పేరుకుపోయాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలకు రూ.4 వేల కోట్ల వడ్డీ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు.

‘‘తెరాస ఎనిమిదేళ్ల పాలనలో డ్వాక్రా గ్రూపులను నిర్వీర్యం చేశారు. 2021-22 బడ్జెట్‌లో డ్వాక్రా గ్రూపులకు వడ్డీ చెల్లించేందుకు రూ.3వేల కోట్లు కేటాయించినా ఇప్పటికీ అమలు కాలేదు. ఆ తర్వాత 2022-23 బడ్జెట్‌లో రూ.1,250 కోట్లు కేటాయించినా.. ఆ నిధులు విడుదల చేయలేదు. ప్రభుత్వం నుంచి వడ్డీ రాయితీ లభిస్తుందనే ఆశతో రుణాలు తీసుకున్న మహిళలు ప్రభుత్వ నిర్వాకంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే ఆ నిధులు విడుదల చేయాలి’’ అని కేసీఆర్‌కు రాసిన లేఖలో సంజయ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని