BRS: హైదరాబాద్‌కు చేరుతున్న ‘భారాస’ పంచాయితీలు

ఇల్లెందు పంచాయితీ హైదరాబాద్‌కు చేరింది. 20 మంది కౌన్సిలర్లతో ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ మంత్రి హరీశ్‌రావును కలిశారు.

Updated : 20 Aug 2023 14:27 IST

హైదరాబాద్‌: రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 21వ తేదీనే అభ్యర్థుల మొదటి జాబితాను భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ ప్రకటిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో టికెట్‌ ఆశిస్తున్న నేతలు పార్టీ ముఖ్యులను కలిసి వెళ్తున్నారు. ఎమ్మెల్సీ కవితను ఉప్పల్‌ ఎమ్మెల్యే భేతి సుభాష్‌ రెడ్డి, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ కలిశారు. ఇద్దరిలో ఒకరికి ఉప్పల్‌ టికెట్‌ ఇవ్వాలని కోరారు. ఉప్పల్‌ టికెట్‌ లక్ష్మారెడ్డికి ఇస్తారన్న ప్రచారంతో ఇరువురు నేతలు కవితను కలిసినట్లు తెలుస్తోంది. 

ఇల్లెందు పంచాయితీ.. హరీశ్‌ను కలిసిన హరిప్రియ

మరోవైపు ఇల్లెందు పంచాయితీ కూడా హైదరాబాద్‌కు చేరింది. 20 మంది కౌన్సిలర్లతో ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ మంత్రి హరీశ్‌రావును కలిశారు. ఇల్లెందు భారాసలో అసమ్మతి దృష్ట్యా హరిప్రియ మంత్రిని కలిసినట్లు సమాచారం. శనివారం ఎమ్మెల్యే హరిప్రియకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలు ఇల్లెందు మున్సిపల్‌ ఛైర్మన్‌ వెంకటేశ్వరరావు ఇంట్లో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. రానున్న ఎన్నికల్లో హరిప్రియకు టికెట్‌ ఇవ్వొద్దంటూ అసమ్మతి వర్గం డిమాండ్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో హరీశ్‌రావును హరిప్రియ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని